Wednesday, April 24, 2024
- Advertisement -

చిరు పొగడ్తలు.. సొట్ట బుగ్గల పిల్లకు హీరోయిన్‌ చాన్స్‌

- Advertisement -

దివి వైద్య.. బిగ్ బాస్ నాలుగో సీజన్ లో సైలెంట్ గా అడుగుపెట్టి తన అందం, మాట తీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సొట్ట బుగ్గల సుందరి నవ్వుతే చాలు.. ఎవరైనా పడిపోవాల్సిందే. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది కొద్ది రోజులే అయినప్పటికీ.. తనదైన చాకచక్యం, అందంతో షోకి బోలెడంతా హైప్‌ తెచ్చింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి.

బిగ్‌బాస్‌లోకి రాకముందు మోడల్‌గా కొనసాగిన ఈ సొట్టబుగ్గల సుందరి.. చాలా సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది. మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు పక్కన నటించడంతో కాస్త గుర్తింపు వచ్చింది. అయితే అందంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌లో స్వయంగా మెగాస్టార్ చిరంజీయే ఈ అమ్మడు అందాన్ని పొగిడేయడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తన సినిమాలోనే కచ్చితంగా అవకాశం ఇస్తానని చిరు హామి ఇచ్చాడు.

అయితే చిరు ఆఫర్ ఇచ్చారా లేదా? అన్నది పక్కన పెడితే.. బిగ్ బాస్ పుణ్యమా అని దివికి హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయని ప్రచారం జరుగుది. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలతో పాటు.. హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయట. ఓ రెండు చిన్న సినిమాలో దివి హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయినట్లు సమాచారం. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ సినిమాలో ఈ సొట్ట బుగ్గల సుందరి ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

వెంక‌టేష్-శేఖ‌ర్ క‌మ్ముల క్రేజీ మువీ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

బాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా బ్రదర్!

మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -