Thursday, April 25, 2024
- Advertisement -

శృతిహాస‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం !

- Advertisement -

కమల్ హాసన్… భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడు. కేవలం హీరోగానే పరిమితం కాకుండా తనలోని దాగున్న పలు ప్రతిభలను బయపెట్టి సత్తా చాటిన వ్యక్తి. వెండితెరకు డాన్సర్ గా పరిచయమైన కమల్ హాసన్.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారి సత్తా చాటుతూ.. స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భుడు క‌మ‌ల్ అనే విధంగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అయన రాజకీయాల్లోనూ తన హవాను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం కమల్ కుమార్తె.. స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ కూడా త‌న తండ్రిబాట‌లో న‌డ‌వ‌డానికి సిద్ద‌మ‌వుతోంది. న‌టిగానే కాకుండా మ‌ల్టీ టాలెంట్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ హాట్ బ్యూటీ ప్ర‌స్తుతం న‌టించిన వ‌కీల్ సాబ్ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించింది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి.

అయితే, శృతిహాస‌న్ ద‌ర్శ‌క‌త్వ విభాగంలోకి వెళ్తున్న‌ట్టు సినీ వ‌ర్గాల్లో మాట్లాడుకుంటున్నాయి. తాను తీయ‌బోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నుల్లో బిజీబిజీగా గ‌డుపుతోంది ఈ ముద్దుగుమ్మ‌. త‌మిళంతో పాటు ఇత‌ర ప‌లు భాష‌ల్లో ప్ర‌స్తుతం ప్రాజెక్టులు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమా షూటింగ్స్ పాల్గోంటూనే తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా పై దృష్టి సారించి.. టైం దొరికిన‌ప్పుడ‌ల్లా తను తీయబోయే సినిమా షూటింగ్ కు ముందుప‌నుల‌ను పూర్తి చేస్తోంద‌ట శృతిహాస‌న్. చూడాలి మ‌రి త‌న తండ్రి క‌మ‌ల్ లాగే వెండితెర‌పై ద‌ర్మ‌కురాలిగా స‌త్తా చాటుతుందో లేదో !

ఇటలీలో అన‌సూయ హ‌ల్‌చ‌ల్ !

బాబోయ్ మాకొద్దీ వర్క్ ఫ్రమ్ హోం..

‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

రెజ్లర్ రితిక ఫొగట్ ఆత్మహత్య

రజినీని ఢీ కొట్టబోతున్న జగ్గూభాయ్ !

వీరి కాంబినేషన్ సూపర్ హిట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -