Sunday, May 12, 2024
- Advertisement -

బాహుబ‌లిలో తార‌క్ గెట‌ప్ ఇదే!

- Advertisement -
tarak gave big shock about bahubali

ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న చిత్రం  బాహుబ‌లి 2. బాహుబలి 1 ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెంజ్ లో కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. భారీ విజువ‌ల్ వండ‌ర్‌గా రూపుదిద్ద‌కున్న బాహుబలి 1 గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు రాబోతున్న బాహుబ‌లి 2 కూడా అదే రెంజ్ లో విజువ‌ల్ వండ‌ర్‌గా తెరకెక్కబోతుందట. అయితే ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న బాహుబ‌లి-2 మ‌రింత ఆశ‌క్తికరంగా రూపొందుతుంది.

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల‌తో క‌ల‌గ‌ల‌సి తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై వ‌స్తున్న వార్త‌లు మ‌రింత ఆశ్చ‌ర్యాన్ని క‌ల్గిస్తున్నాయి. అదేంటంటే, టాలీవుడ్‌లో భీభ‌త్స‌మైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ను ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. జ‌న‌తాగ్యారేజ్ విజ‌యం త‌ర్వాత నెక్ట్స్ సినిమాకి చిన్న గ్యాప్ తీసుకోవాల‌నుకుంటున్నాడు తార‌క్‌. అయితే ఎలాగో ఖాళీగానే ఉంటున్నాడు క‌నుక ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ షూటింగ్ జ‌రుపుకుంటున్న బాహుబ‌లిలో తార‌క్‌ను భాగం చేయాల‌నుకుంటున్నాడ జ‌క్క‌న్న‌.

అయితే తార‌క్‌కు రాజ‌మౌళి బాగా బెస్ట్ ఫ్రెండ్ కావ‌టంతో జ‌క్క‌న్న మాట తీయ‌కుండా ఓకే చెప్పేశాడ‌ట తార‌క్‌. ఈ క్ర‌మంలో భాగంగా తార‌క్‌కు బాహుబ‌లి టీమ్‌లో క‌లిపేందుకు గెట‌ప్ చేంజ్ చేపిస్తున్నార‌ట‌. ఎక్కువ గ‌డ్డం, రాజ‌సం ఉట్టిప‌డేలా మీస‌క‌ట్టు మార్చుకున్న తార‌క్ ఇటీవ‌ల కెమ‌రాకంటికి చిక్కాడు. తల‌సాని వారి పెళ్లి పందిరిలో దిమ్మ‌తిరిగే గెట‌ప్‌తో క‌న్పించ‌టంతో సినీ ప్ర‌ముఖులు షాక్ తిన్నార‌ట‌. మ్యాట‌ర్ ఏంట‌ని ఆరా తీయ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ట‌. తార‌క్ క‌నుక బాహుబ‌లిలో క‌న్పిస్తే టాలీవుడ్ క‌ల‌క్ష‌న్లు మారుమ్రోగిపోవాల్సిందే.

Related

  1. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  2. రికార్డులు మోత మోగించిన ఎన్టీఆర్
  3. ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ఉపాసన!
  4. మోహన్ లాల్ ,ఎన్టీఆర్ ని వాడేస్తున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -