Friday, April 26, 2024
- Advertisement -

ఇలయ దళపతి విజయ్ 65వ మూవీ ఆ నేపథ్యంలోనే?

- Advertisement -

తమిళ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం మాంచి జోరుమీద సినిమాలను తెరకెక్కిస్తూ వెళుతున్నారు. వరుస విజయాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే ఈ హీరో నటించిన ‘మాస్టర్’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో రిలీజైన ఈమూవీ తెలుగులో అనుకున్న విజయాన్ని సాధించలేకపోయినా.. తమిళంలో మాత్రం కోట్లను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ స్టార్ హీరో తన 65వ సినిమాకు గురించి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోతుంది. వీలైనంత తొందరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటుగా.. పొలిటికల్ నేపథ్యంలో సాగుతుందని కోలివుడ్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందాన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బుట్టబొమ్మ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఈ వార్తలపై ఈ చిత్ర యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

‘సత్యమేవ జయతే..’ అంటూ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -