మంత్రి నారాయణ కొడుకు నిషిత్ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. కానీ ఆ కారు పై మరో విషయం బయటకు వచ్చింది. ఆ కారుకు పవన్ కళ్యాణ్ కు ఉన్న లింక్ ఏంటి..? ఆ కారును చూసి పవన్ ఎందుకు అంత ఫీల్ అయ్యారు అనే విషయంపై సోషల్ మీడియాలో ఒక వార్తను బయటకు వచ్చింది.
అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కు కార్లు అంటే మాహా పిచ్చి.. అయితే ఆ మధ్య ఒక కారుని అమ్మారని ఒక వార్త భయటకు వచ్చింది. ఆ కారు ఇదే అని అంటున్నారు. అసలు ఆ కార్ నారాయణ కొడుకు దగ్గరికి ఎలా వచ్చిందంటే, పవన్ కు ఆ కార్ అంటే చాల చాల ఇష్టమట ఏమైందో తెలియదు కానీ పవన్ ఆ కారును బేరానికి పెట్టారు దాన్ని ఎవరో కొన్నారు, తర్వాత పవన్ కు ఆ కారు కొన్నది నారాయణ అని తెలిసి సేల్ ను కాన్సిల్ చేసుకుంటాను అన్నాడట.
{loadmodule mod_custom,Side Ad 1}
కానీ ఇప్పుడు మరణించిన నిశిత్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని పవన్ నడిపిన కారు నాకు కావాల్సిందే అని పట్టుబట్టడంతో నారాయణ చేసేదేం లేక పవన్ కు ఫోన్ చేసి ఆ కారు తనకు అమ్మవలసిందిగా పలుమార్లు కోరడంతో పవన్ అమ్మేసారట. ఇప్పుడు పవన్ సన్నిహిత వర్గం చెప్పే మాట వేరుగా ఉంది, పవన్ అమ్మింది నలుపు రంగు కారు కానీ ఇది తెలుపు..ఆ కారుకు ఈ కారుకు సంబంధం లేదు అని అంటున్నారు. పవన్ కారు కొంటే కొని ఉండొచ్చు కానీ అతనికి కార్లు అంటే ఇష్టం కాబట్టి మరొక బెంజ్ కార్ అయ్యి ఉండొచ్చు ఇది అని వారు వాదిస్తున్నారు. కానీ నిన్న ప్రమాదం జరిగిన కారును సందర్శించి పవన్ పడిన బాధ చూస్తుంటే అది పవన్ కారు కాదని అనలేం. అసలు నిజం ఏంటో అటు నారాయణ కానీ పవన్ కానీ నోరు విప్పితేనే తప్ప భయటకు వచ్చేలా లేదు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}FI3ND4BrH_M{/youtube}
Related