Thursday, May 2, 2024
- Advertisement -

రెజీనా కోసం ముగ్గురు యంగ్ హీరోల ఫైటింగ్‌

- Advertisement -
The Three Heroes Fighting For The Same Heroine Of Tollywood

తెలుగులో అందం, అభిన‌యం రెండు ఆ హీరోయిన్ సొంతం. అయినా స్టార్ హీరోయిన్ స్టేట‌స్ మాత్రం ఆమెకు ద‌క్క‌డం లేదు. ఆమెకు అగ్ర హీరోల ప‌క్క‌న మాత్రం అవకశాలు రావడం లేదు. ఇక్కడ ఛాన్సులు రాక‌పోవ‌డంతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్క‌డ ట్రై చేస్తున్నా స్టార్ స్టేట‌స్ మాత్రం దక్కడం లేదు. బ‌క్క ప‌ల్చ‌ని భామ రెజీనాకు అందం, అభిన‌యం ఉన్నా స్టార్ హీరోయిన్ ఛాన్సులు మాత్రం రావ‌డం లేదు.

అయితే ఇప్పుడు అదే హీరోయిన్ కోసం ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్‌తో మరో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అలాంటిది ఆ ముగ్గురు హీరోలు మాత్రం రెజీనాతో ఏకంగా మూడోసారి జోడీ క‌డుతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో రెజీనా హీరోయిన్. వీరిద్ద‌రు గ‌తంలో రొటీన్ లవ్ స్టోరి, రా రా కృష్ణయ్య సినిమాలో కలిసి నటించారు. వీరికి ఇది మూడో సినిమా.

నక్షత్రం సినిమాలోనే మరో యంగ్ హీరోతో కూడా మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో యంగ్ హీరో నారా రోహిత్ తో కూడా హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతోంది రెజీనా. వీరిద్ద‌రు ఇప్ప‌టికే జ్యో అచ్యుతానంద, శంక‌ర సినిమాల్లో క‌లిసి న‌టించారు. పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇలా రెజీనా కోసం ఆ ముగ్గురు మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం కాస్త విచిత్ర‌మే.

{youtube}oLud-WOCiHE{/youtube}

Related

  1. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
  2. మేకప్ లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
  3. టాలీవుడ్ హీరోయిన్‌ను ప్రేమించి మోసం చేసిన హీరో!
  4. హీరోయిన్ ని కిడ్నాప్ చేసి.. గంటన్నర పాటు నరకం చూపించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -