దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు డిసెంబర్ 18న 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పుట్టిన రోజు పురస్కరించుకుని ఒకరోజు ముందే అంటే గురువారం రాత్రి ఇండస్త్రీ ప్రముఖులకు దిల్‌రాజ్ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి దిల్ రాజు భార్య తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ ఏడాది మేలో దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన భార్య తేజస్వినిని ఇండస్ట్రీ మిత్రులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ఈ వేడుక ఘనంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది
ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని తారలు మొత్తం తరలి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, విజయ్ దేవరకొండ, రామ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్, నాగ చైతన్య, నితిన్ విశ్వక్ సేన్ సహా పలువురు హీరోలు వచ్చారు. అలాగే, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, సమంత నివేదా పేతురాజ్, అనుపమలు హాజరయ్యారు. కానీ ఈ పార్టీకి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలెవరూ హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
అందుకే ఎన్టీఆర్ హాజరుకాలేదు
వాస్తవానికి దిల్ రాజుకు నందమూరి హీరోలతో చనువు ఎక్కువే. గతంలో ఎన్టీఆర్‌తో ఆయన పలు చిత్రాలు చేశాడు. అలాగే, బాలకృష్ణ, కల్యాణ్ రామ్ సినిమాలను పంపిణీ చేశారు. ఇంత క్లోజ్‌గా ఉన్నప్పటీకి దిల్ రాజ్ తన పుట్టినరోజు వేడుకకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదట. ఈ కారణంగానే తమను పిలిచినా కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా దీనికి హాజరు కాలేదనే వార్తలు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ దిల్ రాజు బర్త్‌డే పార్టీకి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలెవరూ హాజరు కాకపోవడం పలు అనుమానాలకు కేంద్ర బిందువుగా మారింది.
బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ట్యూన్ కాపీ చేసిన తమన్.. ‘కింగ్’ సీన్‌తో నెటిజన్లు ట్రోలింగ్