రొమాన్స్‌ను చాలా మిస్‌ అవుతున్నా: స్టార్‌ హీరోయిన్‌

- Advertisement -

యాక్షన్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్‌స్టోరీ చేసి చాలా కాలమైంది. రొమాన్స్‌ చేయడం మర్చిపోయా’ అంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. రీసెంట్ గా కోవిడ్‌ నుంచి కోలుకున్న ఈ భామ గుర్తుందా సీతాకాలం( కన్నడ హిట్ చిత్రం లవ్ మోక్ టైల్ రీమేక్‌ చిత్రం ఇది) అనే సినిమాలో నటిస్తుంది. నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌, మేఘా ఆకాష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.

ఈ మూవీ గురించి తమన్నా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..‘‘లాక్‌డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను. ఎన్నో క‌థ‌లు విన్నాను. అయితే ఈ ఆఫ‌ర్ రాగానే ఎందుకో ఈ ప్రాజెక్ట్‌లో న‌టించాలి అనిపించింది. నిజానికి రొమాన్స్ చేయడం మరిచిపోయాను. ఈ మధ్య అన్నీ కత్తులు పట్టుకుని నటించాను. ఇలాంటి సినిమాలో న‌టించి చాలా రోజులు అయింది.

‘గుర్తుందా శీతాకాలం’తో మ‌రో ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్ ఈ సినిమాకు ప‌ర్‌ఫెక్ట్. అలానే ద‌ర్శకుడు నాగ‌శేఖ‌ర్ గారు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అనిపిస్తోంది. చిత్రయూనిట్ అంద‌రికీ నా శుభాభినంద‌న‌లు’’ అని అన్నారు. ఈ అమ్మడు ‘గుర్తుందా సీతాకాలం’తో పాటు స్పోర్ట్స్ డ్రామా చిత్రం‘ సీటీమార్’లో నటిస్తోంది. ఆ మూవీలో తెలంగాణ జట్టుకు కబడ్డీ కోచ్ గా కనిపిస్తుంది.

అప్పుల పాలైన ‘రియల్‌’ హీరో

వైభవంగా నిహారిక వివాహం.. నాగబాబు భావోద్వేగ ట్వీట్‌

‘ఆదిపురుష్’ కథలో ట్విస్ట్ ఇదేనట…!

వకీల్ సాబ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -