బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

- Advertisement -

దర్శకుడు జయంత్‌సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బావగారు బాగున్నారా అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయింది బాలీవుడ్ బ్యూటీ రచన బెనర్జీ. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేడంతో ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగులో రచన బెనర్జీ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ, సీనియర్ హీరో శ్రీకాంత్ తదితరులు సరసన నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే కొన్ని చెడు అలవాట్లకు బానిస అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ప్రధానంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లతో కెరీర్ నాశనం అవుతుందని.. ఆమె కుటుంబ సభ్యులు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రోబల్ బసు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని అప్పట్లో బలంగా టాక్ వినిపించింది. పెళ్లి తర్వాత పూర్తిగా తన చెడు అలవాట్లకు దూరమైందట. మళ్లీ తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టి అడపాదడపా సినిమాల్లో చేసింది.

- Advertisement -

కాగా ప్రస్తుతం వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. తొందర్లోనే రచన బెనర్జీ తన కొడుకుని బెంగాలీ భాషలో హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తోందట. అయితే రచన బెనర్జీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఒడియాతో పాటు తదితర భాషలలో కలిపి దాదాపుగా 200కు పైగా సినిమాల్లో చేసింది.

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

సుడిగాలి సుధీర్‌కు కరోనా.. రష్మి గౌతమ్ పరిస్థితేంటి..?

జై చిరంజీవ నటించిన ఈ పాప ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...