Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లి పీటలెక్కనున్న యాంగ్ హీరో.. ఎవరంటే?

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో “ఉయ్యాల జంపలా” సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. ఈ మూవీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో హీరో రాజ్ తరుణ్ కు మంచి గుర్తింపు వచ్చింది. “సినిమా చూపిస్తా మామ”, “కుమారి 21 ఎఫ్”వంటి సినిమాలు విజయం సాధించగా తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

రాజ్ తరుణ్ ఇటీవలే తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ “పవర్ ప్లే” లో నటించగా ఈ సినిమా అంతా విజయాన్ని ఇవ్వలేదు.హీరో రాజ్ తరుణ్ ఎలాగైనా సక్సెస్ ని పొందాలనే పట్టుతో ఈసారి మరో వైవిధ్య కథను ఎంచుకున్న రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం “స్టాండ్‌ అప్‌ రాహుల్‌”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇంకా మరో రెండు మూవీలు లైన్ లో తెలుస్తోంది.గత కొంత కాలంగా హీరో రాజ్ తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Also read:వామ్మో ..ప్రభాస్ ఆది పురుష్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే!

తాజాగా రాజ్ తరుణ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరంలో గాని పెళ్లికి ముహూర్తం సెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ హైదరాబాదులో కొత్త ఇంటిని తీసుకున్నాడని, పెళ్లి తర్వాత అక్కడే తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు.

Also read:స్పీడ్ మీదున్న తారక్.. ఉప్పెన దర్శకుడితో సంప్రదింపులు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -