వరస సినిమాలతో ఎప్పుడు దూసెకెళ్ళె రవితేజ ఇటివలె కాలంలో కొన్ని ప్లాప్స్ రావడంతో వెనకబడిపోయాడు. కిక్-2, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత రవితేజ మార్కెట్ పడిపోయింది. దాంతో రవితేజ రెమ్యునరేషన్ భారీ అడుగుతుండటంతో నిర్మాతలు రవితో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదనే గుస గుసలు వినిపిస్తున్నాయి.
బెంగాల్ టైగర్ విడుదలై 8 నెలలు కావస్తున్న రవితేజ ఇప్పటివరకు సినిమా మొదలు పెట్టలేదు. దీంతో రవితేజ ఏమైపోయాడన్న టాక్ కూడా ఇండస్ర్టీలో చర్చకు వచ్చింది. అయితే సినిమాలు ఒప్పుకోలేదా లేక కావాలనే సినిమాలకు బ్రేక్ ఇచ్చాడా అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. దీంతో ప్రస్తుతం రవి ఏంచేస్తున్నడు అని ఆరాతీస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
రీసెంట్ ఫిజిక్ బాగా ఫోకస్ పెట్టిన రవితేజ ఇప్పుడు రిజువినేషన్ థెరపీ చేయించుకునేందుకు ఫారిన్ వెళుతున్నట్టు తెలుస్తోంది. ఫారిన్‌లో ఈ థెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుని రవి మరింత స్లిమ్‌గా మారేందుకు అక్కడకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆ థెరపీ తర్వాత రవితేజ కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది.
Related