Saturday, April 27, 2024
- Advertisement -

తిరుపతిలో పవన్‌ సభ సక్సెస్‌, ఆనందంలో వైసీపీ!

- Advertisement -

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ శనివారం చేపట్టిన పాదయాత్ర, బహిరంగ సభ సక్సెస్‌ అయ్యాయి. పవన్‌ పాదయాత్ర, సభకు భారీ ఎత్తున జనం తరలిరావడంతో బీజేపీ-జనసేన కూటమిలో ఉత్సాహం నింపింది. అదేక్రమంలో పవన్‌ సభ విజయవంతంగా కావడం పట్ల ఆ రెండు పార్టీలతో పాటు వైసీపీ కూడా సంతోషంగానే ఉందట. తాము అనుకున్నట్టుగానే టీడీపీ ఓట్లకు గండికొట్టే పనిని పవన్‌ చేశారని అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ పాదయాత్ర, సభ సక్సెస్‌ కావడానికి పవన్‌ సామాజిక వర్గమే కీలక పాత్ర పోషించింది.

బలిజలను తమ వైపు తిప్పుకున్న పవన్
తిరుపతి సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు టీడీపీ సంప్రదాయ ఓటర్లైన బలిజలను బీజేపీ-జనసేన వైపునలకు మరలేలా చేశాయని చెప్పొచ్చు. చిన్న చిన్న కొట్లు పెట్టుకుని కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకుని బతికే బలిజలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పవన్‌ అన్నారు. ఎదురుతిరిగి నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కామెంట్లు బలిజలను, ముఖ్యంగా ఆ సామాజిక వర్గ యువతను బాగా ఆకర్షించాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేసమయంలో పవన్‌ సభ సక్సెస్‌తో టీడీపీలో గుబులు మొదలైనట్టే!

నోట నుంచి మద్దతు వరకు
తిరుపతి ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని నిలపకపోతే నోటాకైనా ఓట్లేస్తాం కానీ, బీజేపీకీ ఓట్లు వేయమని కొద్ది రోజుల క్రితం చంద్రగిరిలో జరిగిన ఓ సమావేశంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు బీజేపీని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి సభ ద్వారా బలిజలను బీజేపీ వైపునకు తిప్పడంలో పవన్‌ కల్యాణ్‌ వందకు వంద శాతం విజయవంతం అయ్యారు. దీంతో నోటా హెచ్చరికలు, ఎన్నికల ప్రచారంలో జన సైనికులు అంటీమున్నట్టుగా వ్యవహరించడంతో డీలా పడ్డ బీజేపీ.. పవన్‌ సభతో ఊపిరిపీల్చుకుంది. మొత్తం మీద పవన్‌ తిరుపతి పర్యటన వైసీపీకి పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉందనేది పొలిటికల్‌ అనలిస్టులు చెప్తున్న మాట.

పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్…!

పవన్ కళ్యాన్ పై పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి షాకుల మీద షాకులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -