Friday, March 29, 2024
- Advertisement -

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

- Advertisement -

గొంతునొప్పి అనేది సాధార‌ణంగా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్యే. అయితే, ఒక్కోసారి ఈ గొంతునొప్పి తీవ్రంగా మారి మ‌రింత‌గా ఇబ్బంది పెడుతుంది. దీని కార‌ణంగా స‌రిగా మాట్లాడ‌లేక‌పోవ‌డం, గొంతులో మంట రావ‌టం వంటివి చోటుచేసుకుంటాయి. గొంతు నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. అయితే, ఎలాంటి ఇంగ్లీష్ మందులు తీసుకోకుండానే వంటింటి చిట్కాల‌తో దీనిని త‌గ్గించుకోవ‌చ్చు.

గొంతునొప్పిని త‌గ్గించుకోవ‌డానికి సాధార‌ణ టీ తాగే బ‌దులు ల‌వంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క‌, అల్లం వంటి ప‌దార్థాల‌ను వేసి టీ త‌యారు చేసుకుని వేడి వేడిగా తాగాలి. ఆయా ప‌ద‌ర్థాల్లో ఉండే స‌హ‌జ ఔష‌ధ గుణాలు గొంతు నొప్పిని ఇట్టే త‌గ్గిస్తాయి. వీటితో చేసిన టీ తాగ‌డం వ‌ల్ల గొంతు నొప్పితో పాటు సాధార‌ణంగా వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్యలు సైతం దూర‌మ‌వుతాయి.

గొంతు నొప్పి, గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ల‌ను త‌గ్గించ‌డంలో చికెన్ సూప్ చాలా బాగా ప‌నిచేస్తుంది. వేడివేడిగా ఉండే చికెన్ సూప్‌ను తీసుకుంటే గొంతునొప్పితో పాటు జ‌లుబుసైతం త‌గ్గిపోతుంది. అలాగే, మిరియాల‌తో చేసిన చారు లేదా మిరియాలు వేసి కాచిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల కూడా గొంతునొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది.

క‌రోనాతో క‌న్నుమూసిన న‌టుడు సతీష్ కౌల్

యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

మాస్కు పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా: తెలంగాణ పోలీసులు

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -