మలయాళ బ్యూటీ అను ఇమాన్యుయేల్ తన అందంమైన,అమాయకమైన చూపులతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసుదోచి టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ క్వీన్ కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. అను ఇమాన్యుయేల్ తెలుగులో ఇప్పటి వరకు మజ్ను , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ , అజ్ఞాతవాసి నాపేరు సూర్య , అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలలో నటించింది. గీతా గోవింద మూవీలో అతిథి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షేర్ చేయగా ఒక నెటిజన్ వింత కోరిక కోరాడు.నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. మంచి ఇల్లు, గార్డెన్, ఒక స్కూటర్, అంతకు మించి నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది.నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని అనూ ఇమ్మాన్యుయెల్‌కి ప్రపోజ్ చేశాడు. అయితే అనూ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ప్రస్తుతం ఆ నెటిజన్ చేసిన కామెంట్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Also read:లాక్‌డౌన్ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!
అను ఇమాన్యుయేల్ తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాపై అను చాలా ఆశలే పెట్టుకుందట.చూడాలి మరి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో.

Also read:పావలా శ్యామలకు సాయం చేసిన మెగాస్టార్.. ప్రతి నెల?
