Saturday, May 4, 2024
- Advertisement -

వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ తాజాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో “గని” చిత్రం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాక్సింగ్ పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తరువాత షెడ్యూల్ కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దీనికోసం హాలీవుడ్ కి చెందిన లార్నెల్‌ స్టోవల్‌, వ్లాడ్‌ రింబర్గ్‌ నేతృత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఒక స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్మాతలు సిద్దు ముద్దు, బన్నీ వాసు తెలిపారు.

Also read:పూజ హెగ్డేకు ఫిదా అయినా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..?

ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర తదితరులు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

Also read:టాలీవుడ్ లో అడుగుపెడుతున్న శ్రీదేవి చిట్టి కూతురు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -