’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

- Advertisement -

సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ’కలర్ ఫోటో’. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రలో నటించాడు. ప్రోమోస్ లో కూడా అతను చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. దాంతో ఈ సినిమాపై క్రేజ్ పేరిగింది. ఇదే ఏడాది విడుదలైన రవితేజ ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా సునీల్ క్లైమాక్స్ లో విలన్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

అయితే ‘కలర్ ఫోటో’ లో మాత్రం సునీల్ పాత్ర ఆకట్టుకునేలానే కనిపిస్తుంది. అయితే ‘డిస్కో రాజా’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలకు సునీల్.. ఒక్క రోజుకి గాను రూ.5 లక్షల వరకూ పారితోషికం అందుకున్నాడట. మరి ‘కలర్ ఫోటో’కి సునీల్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అనే విషయంకు వస్తే.. ‘కలర్ ఫోటో’ చిత్రం షూటింగ్లో సునీల్ 9 రోజులు పాల్గొన్నాడట.

- Advertisement -

అందుకు గాను రూ.10లక్షల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తుంది. సునీల్ కెరీర్ ప్రారంభంలో.. అదీ కమెడియన్ గా పాపులర్ అయిన రోజుల్లో రోజుకు రూ. 8లక్షల వరకూ పారితోషికం తీసుకునేవాడట. ఇక హీరోగా మారిన తరువాత సినిమాకి రూ.2 కోట్ల నుండీ రూ.3కోట్ల వరకూ అందుకునేవాడని తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు ‘కలర్ ఫోటో’ కి రోజుకి రూ.1లక్ష చొప్పున తీసుకోవడం అందరికి షాకిచ్చింది. సునీల్ రెంజ్ తగ్గిందా అని కొందరు అంటుంటే.. పాత్ర నచ్చడం వల్ల అలా చేశాడని మరికొందరు అంటున్నారు.

హైపర్ ఆది యాంకర్ వర్షిణి నింజగానే ప్రేమించుకుంటున్నారా ?

బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...