Monday, April 29, 2024
- Advertisement -

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలెంటరీ వ్యవస్థపై దేశ వ్యాప్తంగా కూడా మంచి స్పందననే వచ్చింది. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు వైఎస్ జగన్. ప్రభుత్వం అందించే పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయడం వాలెంటర్ల ప్రధాన వీధి. దీంతో ఎలాంటి అవకతవకలు జరకుండా పథకాలన్ని కూడా నేరుగా ప్రజలకు చేరుతున్నాయి. అయితే వాలెంటర్ల పై ప్రభుత్వం అధిక భారం మోపుతోందని, వారికి తగినంత ప్రదాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నప్పటికి.. చాలా వాలెంటరీ వ్యవస్థపై సానుకూలంగానే స్పందిస్తున్నారు..

ఇక ప్రజలు కూడా వాలెంటరీ విధానంతో జగన్ ప్రభుత్వంపై పాజిటివ్ ఒపీనియన్ తోనే ఉన్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పనుల నిమిత్తం ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రజలు.. ఇప్పుడు వాలెంటర్ల ద్వారా వారి సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. జగన్ ప్రవేశ పెట్టిన వాలెంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలపై ప్రజలు సానుకూల భావంతోనే ఉన్నారు. దీంతో వాలెంటరీ వ్యవస్థపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రాకపోతే ఈ వాలంటరీ వ్యవస్థ అలాగే సచివాలయ వ్యవస్థ ఉండే అవకాశం లేదని ప్రజల్లో ఊహాగానాలు ఉన్నాయి. అందువల్ల ఈ వ్యవస్థలు అలాగే కొనసాగలంటే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకునే అవకాశం లేకపోలేదు.

దాంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న టీడీపీ జనసేన వంటి పార్టీలకు మళ్ళీ నిరాశే ఎదురయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ప్రజల దృష్టి ఆకర్షించాలంటే వాలెంటరీ వ్యవస్థను, అలాగే సచివాలయ వ్యవస్థను కొనసాగించాల్సిందే అనే భావనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. తాము గెలిస్తే వాలెంటరీ వ్యవస్థను తొలగించబోమని, అలాగే ఇప్పుడు అందుతున్న పథకాలను కూడా అలాగే కొనసాగిస్తూ.. ఇంకా మెరుగైన పథకాలను ప్రవేశ పెడతామని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే వాలెంటరీ వ్యవస్థ ఎంత ఉపయోగకంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే టీడీపీ సైతం వాలెంటరీ వ్యవస్థను తొలగించడానికి ఏమాత్రం మొగ్గు చూపడం లేదని చెలుస్తోంది. మొత్తానికి వాలెంటరీ వ్యవస్థను తొలగించే సాహసం ఏ పార్టీ కూడా చేయబోదనే విషయం స్పష్టమౌతోంది.

ఇవి కూడా చదవండి

వైసీపీపై కుట్ర.. జరుగుతోందా ?

వన్స్ మోర్ జగన్.. 2024 ?

పొత్తులపై జనసేన క్లారిటీ.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -