Thursday, May 2, 2024
- Advertisement -

సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు, హీరో నవదీప్ జడ్జిలుగా చేస్తున్న షో అదిరింది. ఈ షోకు మరింత క్రేజ్ తెచ్చేందుకు సుమ, శ్రీముఖి, జానీ మాస్టర్‌‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజా ప్రోమోలో హీరో రాజశేఖర్, వైఎస్ జగన్, బాలకృష్ణపై సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. అదిరింది షోలో కంటెస్టెంట్ సద్దాం రాజశేఖర్‌ను అనుకరిస్తూ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత క్రికెట్ నేపథ్యంగా స్కిట్‌ను నడిపిస్తూ జోక్స్ వేశారు.

ఆ తర్వాత వైస్ జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ నమస్కారాన్ని అనుకరిస్తూ మరో కంటెస్టెంట్ రియాజ్ కామెడీ చేశారు. జగన్ కు చేయి అటు నుంచి ఇటువైపుకు ఊపడం ఆయన స్టైయిల్. ఆ స్కిట్‌ను ప్రదర్శిస్తూ.. జగన్ మాదిరిగా విష్ చేయడం చేశాడు. ఆ తర్వాత బాలకృష్ణను అనుకరిస్తూ సద్దాం తెరపైకి వచ్చాడు. ఈ స్కిట్‌ను ప్రదర్శిస్తుండగా.. శ్రీముఖి ఆనందం పట్టలేక కేకలు వేసింది. అంతేకాకుండా నాగబాబు, సుమ, జానీ మాస్టర్ కడుపుబ్బ నవ్వారు. ఇది ఇలా ఉంటే సీఎం జగన్ ఒక రాష్ట్రానికి సీఎం.

అలాంటి వ్యక్తిని అవమానిస్తూ జీ తెలుగులో అదిరింది షో ఉందని వైసీపీ ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఏదైన పని చేసే ముందు జాగ్రత్తగా చేయాలి అని అంటారు. కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం సీఎం జగన్ ను హేళన చేయడం కరెక్ట్ కాదని.. మరోసారి ఇలాంటివి చేస్తే కథ వేరే ఉంటుందని అదిరింది షోకి వైసీపీ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. వైసీపీ ఫ్యాన్స్ నుంచి వార్నింగ్స్ రావడంతో స్కిట్ లో జగన్ లా చేసిన రియాజ్ క్షమపణ చెప్పాడు.

మరోసారి జగన్ గారిని అనుకరిస్తూ స్కిట్ లో చేయనని చెప్పాడు. ఈ ఒక్కసారికి తనను క్షమించాలని అన్నాడు. ఇక అలానే స్కిట్ లో జగన్ లా చేస్తుంటే కడుపుబ్బా నవ్విన నాగబాబు, శ్రీముఖి, జానీ మాస్టర్ పై కూడా వైసీపీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. జగన్ గారిని హేళన చేస్తే మీకు నవ్వు ఎలా వస్తుందని మండిపడుతున్నారు. కొందరు జగన్ ఫ్యాన్స్ అయితే నాగబాబు, శ్రీముఖి, జానీ మాస్టర్ యాక్సిడెంట్ లో పోయ్యారని కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు కూడా సీఎం లాంటి వ్యక్తిని టీఆర్పీ రేటింగ్ కోసం అలా చేయడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు.

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

మోనాల్ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళిన అభిజిత్, అఖిల్..!

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -