Thursday, May 16, 2024
- Advertisement -

అబూస‌లేంకు జీవిత ఖైదు….

- Advertisement -

ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసేసింది. అబూసలేంతో పాటు కరీముల్లాకు టాడా కోర్టు జీవిత ఖైదును విధించింది. తాహిర్ మర్చంట్, ఫిరోజ్‌లకు ఉరిశిక్ష విధించగా, రియాజ్ సిద్దిఖికీ పదేళ్ళ శిక్ష విధించింది టాడా కోర్టు. మరోవైపు ఎలాంటి ఆధారాల్లేవని అబ్దుల్ ఖయ్యూమ్‌ను నిర్ధోషిగా కోర్టు విడుదల చేసింది.

ముంబైలో 1993లో మార్చి 12వ, తేదిన వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి. ఈ ఘటనలో అబూసలేం సహ ఆరుగురిని నిందితులుగా టాడా కోర్టు తేల్చింది. రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల ముంబైలో వరుస పేలుళ్ళు చోటుచేసుకొన్నాయి. ఈ పేలుళ్ళ ఘటనలో 257 మంది మృతి చెందారు. 712 మంది తీవ్రంగా గాయపడ్డారు.

శిక్ష ప‌డిన వారిలో అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్‌ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్ మర్చంట్, ఫెరోజ్‌ ఖాన్‌ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్‌ కు యావజ్జీవ శిక్ష, రియాజ్‌ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.

బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌, మహ్మద్‌ దోసా, ముస్తఫా దోసాలు కుట్ర పన్ని దాడికి పాల్పడినట్లు సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ కేసులో ముంబయిలోని ప్రత్యేక టాడా న్యాయస్థానం 2007లో విచారణ ముగించింది. అందులో 100 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరైన యాకూబ్‌ మెమన్‌కు 2013లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2015లో ఈ శిక్షను అమలు చేశారు.

కేసు విచారణ ముగిసే సమయంలో ముంబయి పేలుళ్లతో సంబంధం ఉందంటూ ముస్తఫా దోసా, అబుసలెం సహా మరో ఏడుగురిని అరెస్టు చేశారు. దీంతో వీరిని ప్రధాన విచారణ నుంచి వేరు చేసి రెండో విడత విచారణ చేపట్టిన టాడా కోర్టు వీరిలో ఆరుగురిని దోషిగా తేలుస్తూ నేడు శిక్ష ను విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -