Thursday, May 16, 2024
- Advertisement -

జూన్ 8 మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకారం.. సీఎం జగన్ శాఖలవారీ సమీక్షల షెడ్యూల్

- Advertisement -

ఏపీలో కొత్త సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ఒక్క‌డే ప్రమాణస్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌రిపాల‌న‌పై దృష్టి సారించాలంటె మంత్ర వ‌ర్గం ముఖ్యం. అందుకే జ‌గ‌న్ మ‌త్రి వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు.మంత్రివర్గం ఎలా ఉండాలి? ఎవరికి స్థానం కల్పించాలి? అనే అంశాలపై జగన్ వైసీపీ ముఖ్యనేతలతో ఇప్ప‌టికే చర్చించారు.

కొత్త క్యాబినెట్ కొలువుదీరేందుకు జూన్ 8 ముహూర్తంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ రోజున మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మంచి రోజు కావడంతో జగన్ కూడా జూన్ 8న ఏపీ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 9 గంటల లోపు తన చాంబర్ లో ప్రవేశించనున్నారు. మంత్రి వ‌ర్గంలో ఎమ్మెల్యేల‌తో పాటు ఎమ్మేస్లీల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

మ‌రో వైపు జ‌గ‌న్ ప‌రిపాల‌న‌మీద దృష్టి సారించారు. శ‌నివారంనుంచి ప‌లు శాఖ‌ల‌పై స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌య్యారు. శనివారం ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలపై వైయస్ జగన్ సమీక్షలు చేయనున్నారు. జూన్ 3న విద్యాశాఖ, జూన్ 4న సాగునీరు, హౌసింగ్ శాఖలపై సమీక్షలు చేయనున్నారు. జూన్ 5న వ్యవసాయం, జూన్ 6న సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్షలు చేయనున్నారని తెలుస్తోంది.

జూన్ 6న సీఆర్డీఏపై జగన్ సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఆర్డీఏలో ఏయే అంశాలపై జగన్ రివ్యూ నిర్వహిస్తారా అన్న ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటె రాజ‌ధాని భూ సేక‌ర‌ణవిష‌యంలో కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోనిని అంద‌రూ అస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -