Tuesday, April 30, 2024
- Advertisement -

బొబ్బిలి కోటలో ఫ్యాన్ హవా!

- Advertisement -

బొబ్బొలి రాజుల కోటలో జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. గత ఎన్నికల్లో బొబ్బిలిలో జెండా పాతిన వైసీపీ ఈసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. టీడీపీ అభ్యర్థిగా బేబినాయన పోటీ చేస్తుండగా వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు బరిలో ఉన్నారు.

2004లో బొబ్బిలి నుండి సుజయ కృష్ణరంగారావు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009,2014లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయితే 2019లో జగన్ సునామీలో సుజయకు ఓటమి తప్పలేదు. దీంతో రాజకీయాల నుండి తప్పుకున్న సుజయ…తన వారసత్వాన్ని బేబినాయనకు అప్పగించారు.

1983లో రాజకీయాల్లోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి శంబంగి.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తాను మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి సమస్య లేకుండా చేశానని…జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడుసార్లు, టీడీపీ మూడుసార్లు గెలిచాయి. తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న బేబినాయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తుండగా బొబ్బిలి కోటలో మళ్లీ పాగా వేసేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. మరి బొబ్బిలి పోరులో రాజుగా నిలిచేదెవరో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -