Thursday, May 16, 2024
- Advertisement -

జగన్ సంచలన నిర్ణయం.. బాబుకు షాక్

- Advertisement -

కృష్ణ నది కరకట్టపై చంద్రబాబు ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం ప్రజావేదిక. చంద్రబాబు అధికారులు, ప్రజాప్రతినిధులతో ఇక్కడే సమావేశాలు, సమీక్షలు నిర్వహించేవారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా తన ఇంటిపక్కనే ఉన్న ఈ భవనాన్ని తాను వాడుకుంటానని బాబు సీఎం జగన్ కు లేఖ రాయడం విశేషం. చంద్రబాబు నివాసం కూడా అక్రమంగా పక్కనే ఉంది. దాన్ని ఆనుకొనే ఈ ప్రజావేదికను బాబు నిర్మించుకున్నారు. ఆయనే సీఎంగా ఉండడంతో ఈ అక్రమ కట్టడంపై ఎవరూ నోరు మెదపలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది.

తాజాగా చంద్రబాబు ఆధీనంలో ఉన్న ప్రజావేదికను బాబు సామానులు బయటపడేసి నిన్ననే జగన్ అందులో కలెక్టర్ల మీటింగ్ కు ఆదేశాలు ఇప్పించారు. ఈరోజు కలెక్టర్ల సదస్సును కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇదే ఈ ప్రజావేదికలో నిర్వహించే చివరి సమావేశం అని.. అక్రమంగా చంద్రబాబు నిర్మించిన ఈ ప్రజావేదికను వేల్లుండి కూలగొట్టబోతున్నామని సంచలన ప్రకటన చేశారు..

చంద్రబాబు ఈ కట్టడాన్ని కృష్ణ నది కరకట్టపై అక్రమంగా నిర్మించాడని.. రూ.5కోట్లకు ప్రతిపాదించి.. రూ.8 కోట్లకు పెంచారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉండడంతో దీనిపై ఎవరూ ఏమీ అనలేదని.. ిప్పుడు అలాంటివి కుదరదని స్పష్టం చేశారు. పర్యావరణ, నదుల చట్టాలతోపాటు అన్ని రకాల నిబంధనలను బాబు తుంగలో తొక్కి ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని జగన్ ఆరోపించారు.

ఈ అక్రమ కట్టడం.. దీనివెనుక బాబు అవినీతిని ప్రజలకు చూపించేందుకు ఇందులో తాను సమావేశం పెట్టానని.. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని ఆదేశించినట్టు తెలిపారు. ఎల్లుండి దీంతో పాటు అక్రమంగా కట్టిన అన్ని భవనాలను కూల్చివేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -