Monday, May 20, 2024
- Advertisement -

అధికారుల బ‌దిలీపై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన ఎన్నిక‌ల అధికారి..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అదికారుల బ‌దిలీల వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముంకుంది. సీఎం చంద్ర‌బాబుకు, ఈసీకి మ‌ధ్య బిగ్‌వార్ జ‌రుగుతోంది. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీల‌తో పాటు ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును సీఈసీ బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ ప్ర‌భుత్వం హైకోర్ట‌కి వెల్లింది. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టులో కేసు న‌డుస్తోంది. ఇద‌లా ఉంటె ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారుల బ‌దిలీపై ఎవ‌రికీ కార‌ణాలు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సాధారణ రోజుల్లో బదిలీ జరిగినా ఎలాంటి కారణాలు చెప్పరు కదాని అన్నారు. ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేది.. బదిలీ చేసింది సీఈసీ అయితే నాకు లేఖ రాసి ఏమి ప్రయోజనం..? అని గోపాల కృష్ణ ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉందని, ఆ విషయంలో తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. జ‌గ‌న్, విజ‌య‌సాయిల బేయిల్ ర‌ద్దు చేయాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -