Friday, May 17, 2024
- Advertisement -

జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం….ఏపీ డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్ నియామ‌కం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో తనదైన మార్క్ పాలనను జగన్ మోహన్ రెడ్డి అప్పుడే పనులు ప్రారంభించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న అవినీతిని ప్ర‌క్షాల‌న చేసె దిశ‌గా ముందుకు సాగుతున్నారు. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నె సీఎంలో ఉన్న న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు డీజీపీ ఠాకూర్ పై బ‌దిలీ వేటు వేసింది. విజిలెన్స్ డీజీగా ఉన్న సవాంగ్‌కు డీజీపీగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న ఉన్న త్రిపాఠీని జేఏడీకి బదిలీ చేశారు. అలాగే, జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్‌ను నియమించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓఎస్టీగా కృష్ణమోహన్ రెడ్డిని నియమించారు.

ఏపీ డీజీపీగా ఉత్త‌ర్వులు వెలువ‌డిన త‌ర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జ‌గ‌న్‌తో గౌత‌మ్ స‌వాంగ్ ఈ భేటీ జరిగింది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా సీఎంతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించారు. రేపు డీజీపీగా పూర్తి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు గౌత‌మ్ స‌వాంగ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -