Tuesday, May 21, 2024
- Advertisement -

ఇంత అనుభవంతో బాబు చివరికి చేసింది ఇదేనా!

- Advertisement -

తెలంగాణ నుంచి ఏపీ వైపు వెళ్లే రవాణా, కమర్షియల్ వెహికల్స్ పై భారీ వడ్డన విధిస్తున్నారు. ఇప్పటికే ఇలా పన్నులు వసూలు చేయడం మొదలై కొన్ని గంటలు గడిచాయి. దీంతో ఏపీ ప్రభుత్వ ఖాతాలో కొన్ని కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని అంటున్నారు. మరి దీనికి ఆనందపడాలా?

ముప్పై ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే తెలుగుదేశం అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరకు చేయగలిగినది ఇదేనా? ఏపీ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ సర్కారు అంతరాష్ట్ర పన్నులను విధిస్తే.. అందుకు ప్రతీకారంగా తెలంగాణ నుంచి వచ్చే వాహనాలపై అదే స్థాయి పన్నులను విధించడం తప్ప బాబు ఏమీ చేయలేకపోయాడా! ఈ మాత్రం రీవేంజ్ కోసం బాబు ఇన్ని రోజులు వేచి చూసి.. తన మంత్రులతో చర్చలు జరిపాడా! మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి పన్నులతో లాభం వస్తే వస్తుండవచ్చు. అయితే దీని వల్ల ప్రజలపై పడే భారం మాటేమిటి?!

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అనునిత్యం ఏపీ పరిధిలోని జిల్లాల నుంచి కొన్ని వేల మంది ప్రజలు హైదరాబాద్ కు వస్తూనే ఉంటారు. వీరు ప్రయాణించే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర పన్నులను విధించింది. దీంతో వాహన యజమానులు ఆ పన్నులు కడతారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతారు. రాజధాని నగరానికి వచ్చే జనాలనుంచి దాన్ని వసూలు చేసుకొంటారు. అయితే ఇది అనైతికం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తో మాట్లాడాల్సింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరిపి.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి కదా.. ఇలా పన్నులు విధిస్తే ఎలా? అని కొశ్చన్ చేయాల్సింది! న్యాయపరమైన మార్గాల గురించి కూడా ఆలోచించాల్సింది. అయితే బాబు ప్రభుత్వం ఈ పని చేయలేదు! తెలంగాణ ప్రభుత్వ చర్యలకు ప్రతీకారంగా ఇక్కడ నుంచి వెళ్లే వాహనాలపై పన్నులు విధించి ప్రతీకారం తీర్చుకొన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఇలా తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై పన్నులు విధించడం వల్ల.. ఆ భారాన్ని కూడా వాహనదారులు చివరకు జనాల మీదే మోపుతున్నారు! అంటే ఏపీ జనాలకు ఈ పన్నుల వ్యవహారంతో రెండు వైపుల నుంచి కూడా భారమే పడుతుంది! ఇదీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీఎం తీరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -