Friday, May 17, 2024
- Advertisement -

భారత్ పై మరో భయంకర కుట్రకు తెరలేపిన పాక్…ఇక యుద్ధమే

- Advertisement -

ఉగ్రవాదం విషయంలో తన వక్రబుద్దిని మరో సారి చాటుకుంది పాకిస్థాన్.కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.కశ్మీరీల హక్కుల కోసం అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడబోమని ప్రగల్భాలు పలుకుతోంది. ఇదే సమయంలో ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి పంపించి అలజడలకు పాక్ పెద్ద పన్నాగమే చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

అంతర్జాతీయ ఒత్తిళ్లతో ఇటీవల అరెస్ట్ చేసిన జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను రహస్యంగా విడిచిపెట్టినట్టు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి సమాచారం అందింది. భారత్-పాక్ సరిహద్దులోని రాజస్థాన్- కశ్మీర్ సెక్టార్లో పెద్ద కుట్రకు పాక్ పావులు కదుపుతోందన్న ఐబీ సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తోంది.ఐబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సియాల్‌కోట్- జమ్మూ, రాజస్థాన్‌ సరిహద్దుల్లో పెద్ద కుట్రకు పాక్‌ తెరతీసినట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో తీవ్రంగా రగలిపోతున్న పాక్.. రాజస్థాన్‌ సరిహద్దుల్లో భారీ స్థాయిలో ఆర్మీని మోహరించినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది.

భారత్‌కు దీటైన సమాధానం ఇస్తామని ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ హెచ్చరించారు. అందులో భాగంగానే ఇప్పుడు మసూద్‌ను వదిలిపెట్టినట్టు ఐబీ భావిస్తోంది.ఉగ్రవాద సంస్థలకు దిశానిర్దేశం చేయడానికే అజార్‌ను విడుదల చేసినట్టు ఐబీ తెలిపింది.భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -