మంత్రి అయ్య‌న్న ద‌గ్గ‌ర‌ భూ కుంబ‌కోన నిందుల జాతకాలు ఉండాయంట‌…?

- Advertisement -
Ayyanna Patrudu vs Ganta Srinivasa Rao over Visakha Land Scam

రాష్ట్రంలో విశాఖ భూకుంభ‌కోనం వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది.ల‌క్ష ఎక‌రాల కుంభ‌కోనంలో అధికార‌పార్టీ నాయ‌కుల హ‌స్తం ఉన్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో ఏంజ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.ఇప్ప‌టికే విశాఖ‌కు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రులు అయ్య‌న్న‌,గంటాల మ‌ధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి.

అయితే ఇప్పుడు స‌మ‌స్యంతా విశాఖ భూ కుంభ‌కోణంలో గంటా హ‌స్తం ఉంద‌ని నిరూపించేందుకు అయ్య‌న్న వ‌ద్ద ప‌క్కా సాక్షాధారాలున్నాయ‌ట‌. ఇదే ఇప్పుడు బాబ‌కు,పార్టీకి నిద్ర‌లేకుండా చేస్తోంది. ఒకవేళ ముఖ్య‌మంత్రి అడిగితే వాటిని ఆయ‌న వ‌ద్ద ప్ర‌వేశ‌పెట్టేందుకు అయ్య‌న్న వ‌ర్గం సిద్ధంగా ఉంది. అయితే అయ్య‌న్న ప్ర‌స్తుతం సింగపూర్ లో ఉన్నారు. ఆయ‌న విశాఖ రాగానే ప‌త్రాల‌తో సీఎంను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

- Advertisement -

{loadmodule mod_custom,GA1}

కాగా సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రం సాక్షాధారాలుంటే సిట్ కు ఇవ్వాల‌ని వాళ్లు విచారించి నివేదిక అంద‌జేస్తార‌ని అయ్య‌న్న‌కు సూచిస్తున్నారు. అందుకు అయ్య‌న్న వ‌ర్గం ఎంత మూత్ర‌మూ సుముఖంగా లేదు. విశాఖ భూకుంభ‌కోణంలో అంద‌రూ అనుకుంటున్నంత చిన్న‌దేమీ కాద‌ని, దీని వెన‌కాల చాలా మంది ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంద‌ని, అందుకు త‌గిన అన్ని రెవ‌న్యూ ఆధారాలు అయ్య‌న్న వ‌ద్ద ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది.
దీంతో అధికార‌నేత‌ల్లో గుబులు మొద‌లైంది. విశాఖ భూకుంభ‌కోణం సంబంధించి అయ్య‌న్న వ‌ద్ద ఎవ‌రెవ‌రి జాత‌కాలున్నాయ‌నేదానిపైనే ఇప్పుడు తెలుగుదేశం నేత‌ల్లో తీవ్ర చ‌ర్చ‌జ‌రుగుతోంది. అయ్య‌న్న లాగే తీగ‌కు స‌ర్కారు డొంక అంతా క‌దిలి పార్టీ, ప్ర‌భుత్వం ప‌రువు బ‌జారున ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.
ప్ర‌త్య‌ర్థి గంటాను రాజ‌కీయంగా భారీ దెబ్బతీసే అవ‌కాశం ఈ రూపంలో ఆయ‌న‌కు దొరికింది. విశాఖ రాజ‌కీయాల్లో ఆది నుంచి టీడీపీలోనే కొన‌సాగుతున్న అయ్య‌న్నకు మించి నాలుగు పార్టీలు మారి వ‌చ్చిన గంటాకు ముఖ్య‌మంత్రి వ‌ద్ద ప‌లుకుబ‌డి పెర‌గ‌డం, దాంతో విశాఖలో గంటా చ‌క్రం తిప్పుతుండ‌డం అయ్య‌న్న‌కు ఎంత మాత్ర‌మూ మింగుడుప‌డ‌డం లేదు.

{loadmodule mod_custom,GA2}

గంటాను దెబ్బ‌కొట్టేందుకు స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్న అయ్య‌న్న‌కు విశాఖ భూకుంభ‌కోణం బ్ర‌హ్మాస్త్రం దొరికింది. కుంభ‌కోణం వెన‌కాల ఉన్న గుట్టు మొత్తాన్ని అయ్య‌న్న త‌వ్వితీశారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భూముల క‌బ్జాకు పాల్ప‌డిన చిట్టా మొత్తం ఆయ‌న వ‌ద్ద ఉంద‌ట‌. అయ్య‌న్న ద‌గ్గ‌ర‌నున్న ఆధార‌లు బ‌య‌ట‌పెడితే గంటాకు గంట‌మోగ‌డంఖాయం.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}7YDJlJZBhfI{/youtube}

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -