Thursday, May 16, 2024
- Advertisement -

కాపుల‌ను బీసీలో చేర్చితే ఊరుకోం క‌బ‌ర్దార్‌ : ఆర్ .కృష్ణ‌య్య‌

- Advertisement -

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నాయుడికి కాపు రిజ‌ర్వేష‌న్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో మేనిఫెస్టోలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌నె హామీని పెట్టారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపు రిజ‌ర్వేష‌న్ల‌గురించి మాట్లాడ‌క‌పోవ‌డ‌తో కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పోరాటం చేస్తున్న‌సంగ‌తి తెలిసిందే.

కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వంకాపు మంజునాధన్ కమిటీ కమిటీ వేసిన విషయం తెలిసిందే. కాపులకు నష్టం జరగకుండా బీసీలలో చేరుస్తామని టిడిపి ప్రభుత్వం చెబుతోంది. బీసీలు మాత్రం వద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితె ఇప్పుడుతాజాగా బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆర్‌.కృష్ణ‌య్య బాబుకు వార్నంగ్ ఇచ్చారు. కాపుల‌ను బీసీలో చేర్చితే స‌హించేదిలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాజ్యాధికారం కోస‌మే కాపులు త‌మ‌కు బీసీల హోదా కావాల‌ని కోరుతున్నార‌ని తెలిపారు. కాపుల‌ను బీసీల్లో చేర్చితే వెన‌క‌బ‌డిన త‌రగ‌తులకు అన్యాయం జ‌ర‌గ‌దా? అని ప్ర‌శ్నించారు. నిజానికి తెలంగాణ‌లోనే కాపులు వెన‌క‌బ‌డి ఉన్నార‌ని, ఏపీలో కాపులు అన్ని రంగాల్లోనూ ముందున్నార‌ని ఆర్‌.కృష్ణ‌య్య తెలిపారు.

కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తే తాము ఆయ‌న‌తో విభేదిస్తామ‌ని, త‌న‌కు టీడీపీ ఎమ్మెల్యే ప‌ద‌వి ముఖ్యం కాదని చెప్పారు. బీసీల సంక్షేమం మాత్రమే త‌న‌కు ముఖ్యమ‌ని అన్నారు. ఏపీలో బీసీల సంక్షేమం కోసం ఉద్యమ ప్ర‌ణాళిక రూపొందిస్తున్నామ‌ని అన్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం క‌త్తిమీద సామే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -