Sunday, May 19, 2024
- Advertisement -

బాబుపై కేసు నమోదైతేనే.. బీజేపీ పతివ్రత అవుతుంది!

- Advertisement -

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటుకు ఓటు వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ప్రమేయం గురించి ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ ఉండంగానే బీజేపీ నేత, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ వచ్చి ముందుగా బాబును తర్వాత కేసీఆర్ ను కలిశాడు.

అయితే గోయల్ మాత్రం తాను మధ్యవర్తిగా వ్యవహరిచండానికి రాలేదని స్పష్టం చేశాడు.

ఏసీపీ కేసులో డీల్ సెట్ చేయడానికి తాను రాలేదని ఆయన వివరణ ఇచ్చుకొన్నాడు. ఈ వ్యవహారంలో గోయల్ ఇరు వర్గాలకూ మీడియేటర్ గా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ బురదను కడుక్కోవడానికి ఈ కమలం పార్టీ నేత ప్రయత్నించాడు. 

మరి గోయల్ మాటలను అంత ఈజీగా నమ్మడానికి చాలా మంది సిద్ధంగా లేరు. గోయల్ కు బాబుకు సన్నిహితుడనే పేరుంది కాబట్టి..ఈయన బాబును రక్షించడానికి ప్రయత్నించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే గోయల్ మాత్రం ఆ వార్తలను ఖండిస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు గనుక నోటుకు ఓటు వ్యవహారంలో ఏసీబీ బాబును వదిలస్తే.. ఈ కేసు గనుక నీరుగారిపోతే.. బీజేపీ నేతపై మరిన్ని ఆరోపణలు వస్తాయి. ఇరు వర్గాలకూ బీజేపీ మీడియేటర్ గా వ్యవహరిచిందనే ఆరోపణలు వస్తాయి. అలా జరగకూడదు అంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు కావాల్సి ఉంటుంది! అప్పుడు బీజేపీ పాతివ్రత్యం రుజువు అవుతుంది. లేకపోతే..బీజేపీ కూడా విమర్శలను ఎదుర్కొనవలసి ఉంటుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -