Saturday, May 18, 2024
- Advertisement -

సీట్ల పెంపుపై మోదీ నిర్న‌య‌మే ఫైన‌ల్‌…

- Advertisement -

కేంద్రానికి వీర విధేయులుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల క‌ల‌లు క‌ల‌గానె మిగ‌ల‌నున్నాయి. ఇన్నాల్లు గంపెడాశ‌తో సీట్ల పెంపుపై ఆశ‌లు పెట్టుకున్న ఇద్ద‌రి ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది. నోట్ల రద్దు, జీఎస్టీ తదితర అంశాల్లో పోటీ పడి మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రం మాత్రం ఇద్దరు చంద్రులకు కోలుకోలేని షాకిచ్చింది.
రెండు రాష్ట్రాల్లో టీఆర్ఎస్‌,టీడీపీ పార్టీలు పోటీ ప‌డి పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించి స‌క్సెస్ అయ్యారు. అంత వ‌ర‌కు బాగానె ఉంది. కాని ఇప్పుడే ఇద్ద‌రు సీఎంల‌కు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి. సీట్ల‌పెంపు అంశంపై కేంద్రం కొర్రీ వేసింది.తాము అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తున్నందున నియోజకవర్గాల పెంపుకు సహకరించాలని కోరారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజ్‌నాథ్‌ సింగ్ ఒకే సమాధానం చెప్పారు. సీట్ల పెంపుపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ షాక్ ఇచ్చారు.
పిరాయింపు ఎమ్మెల్యేల‌కు సీట్ల‌ను స‌ర్దు బాబు చేయాలంటె సీట్ల పెంపె త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌డంలేదు. వెంకయ్యనాయుడు కూడా కేంద్రంలో మంచి ఫాంలో ఉండడంతో పెంపు ఈజీ అయిపోతుందనుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపు బిల్లును తీసుకొస్తామని ఆ మధ్య వెంకయ్యనాయుడు బల్లగుద్ది చెప్పారు. అయితే వెంకయ్యనాయుడుని ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించేశారు.
సీట్ల పెంపుపై ఇంతకాలం న్యాయశాఖ సలహా పేరుతో దాటవేసిన కేంద్రం… ఇప్పుడు నేరుగా రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పడంతో కేసీఆర్, చంద్రబాబు షాక్ అయ్యారు. రాజకీయంగా నిర్ణయం అంటే సీట్ల పెంపు లేనట్టేనని ముఖ్యమంత్రులు సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు తెలంగాణ బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారనే వారు భావిస్తున్నారు. సీట్ల పెంపు వల్ల తెలంగాణలో టీఆర్‌ఎస్ కే లాభం చేకూరుతుందని, సీట్లు పెంచితే టీడీపీ, కాంగ్రెస్ ల్లో మిగిలిన నేతలు టీఆర్‌ఎస్ లో చేరతారని.. సీట్లు పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో వారంతా కమలం వైపు మొగ్గు చూపే అవకాశముందని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.అయినా వీరి పిచ్చి కాక‌పోతె భాజాపాకు లాభం లేకుండా నిర్న‌యం తీసుకుంటుందా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -