Sunday, May 19, 2024
- Advertisement -

కొడుకు మాట‌ల‌ను స‌మ‌ర్థించిన చంద్ర‌బాబు…

- Advertisement -

2019 ఎన్నిక‌లు ఏపీ మ‌రో సారి కురుక్షేత్ర సంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. ఇప్ప‌టి నెంచె అన్నిపార్టీ త‌మ అస్త్ర‌, శ‌స్త్రాల‌ను సిద్దం చేస్తున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో గెలిచి ఊపుమీదున్న అధికార ప‌ర్టీ అదే ఊపును కొన‌సాగించాల‌ని బాబు నేత‌ల‌కు పిలుపు నిచ్చారు.

ప్ర‌తిప‌క్షం వైసీపీ అన్న వ‌స్తున్నాడు పేరుతో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను చేప‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర‌లో ప్ర‌తీ కుంటుంబాన్ని క‌ల‌సి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వివ‌రించ‌డంతోపాటు….న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను కూడా తీసుకెల్లనున్నారు. దీనికి పోటీగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివిరించేందుకు ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

శ్రీకాకుళం జిల్లా తెట్లంగిలో ‘ఇంటింటికీ టీడీపీ’ని ప్రారంభించారు చంద్ర‌బాబు నాయుడు. మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరును పూర్తి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయడమే తన లక్ష్యమని, అందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాల్సి వుంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.

2014 ఎన్నికల్లో 1.5 శాతం ఓట్లను అధికంగా తెచ్చుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటీవలి నంద్యాల ఎన్నికల్లో 16 శాతం ఓట్లను తెచ్చుకున్నామని, కాకినాడలోనూ ఘన విజయం సాధించామని అన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం చిన‌బాబు లోకేష్ కూడా ఇవే మాటలు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -