Thursday, May 16, 2024
- Advertisement -

బాబు ఖాలీ కుర్చీల‌తో ప్ర‌తిజ్ణ‌….జ‌నంసొమ్మును మంచినీల్ల‌లాఖ‌ర్చు

- Advertisement -
Chandrababu Nava Nirmana Deeksha Expenditure

విభ‌జ‌న స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట‌పోయింద‌నీ …ఎక్క‌డ స‌మావేశాలు జ‌రిగినా ప‌దేప‌దే ఊద‌ర‌గొడుతుంటారు.కాని ఆయ‌న చేస్తున్న దానికి..చెప్పిన మాట‌ల‌కు పొంత‌న‌లేకుండా పోతోంది.అన‌వ‌స‌ర కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌ల సొమ్మును మంచినీల్ల‌లా ఖ‌ర్చుపెడుతున్నారు.

ఆయ‌న దుబారా ఖ‌ర్చుకు అంతేలేకుండా పోతోంది.సీఎంగా ప్ర‌మాన‌స్వీకారానికి వంద‌ల‌కోట్లు ఖ‌ర్చుపెట్టిన బాబు …అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మానానికి రూ.400 కోట్లు ఖ‌ర్చు చేశారు.ఇక అసెంబ్లీ,స‌చివాల‌యం గురించి చెప్ప‌న‌క్క‌లేదు.

{loadmodule mod_custom,GA1}

ఏపీకి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం లేకుండా చేసిన బాబు జూన్ 2ను చీక‌టి రోజుగా అభివ‌ర్నించి .. ప్ర‌జ‌ల సెంటీమెంట్‌ను క్యాష్ చేసుకుంటున్నారు.అందుకే ఆరోజు న‌వ‌నిర్మాణ దీక్ష‌ల కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.ఈసారి ఏకంగా వారంరోజుల‌పాటు ఈదీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి.ముచ్చటగా మూడోసారి ఇప్పుడు నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయి. కానీ, ఏం లాభం.? ఈసారి నవ నిర్మాణ దీక్షలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఎక్క‌డ చూసినా ఖాలీ కుర్చీలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డాకూడా స‌క్సెస్ కాలేదు.బాబు ఖాలీ కుర్చీల‌తోనే న‌వ‌నిర్మాణ దీక్ష‌ల ప్ర‌తిజ్ణ చేయించారు.
ఏపీ లోటు బ‌డ్జెట్‌లో ఉంది …రాజ‌ధానికి విరాలాలు ఇవ్వండంటూ అడుక్కుంటూనే ..వ‌చ్చిన డ‌బ్బును సొంత విలాసాల‌కు ఖ‌ర్చుపెడుతున్నారు.న‌వ నిర్మాన దీక్ష‌ల కార్య‌క్ర‌మంలో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో జరిగిన సభ అయితే మరీ ఘోరం. ఈ మూడేళ్ల‌లో వీటికోసం 75 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని ఇప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. 75 కోట్లు ఖ‌ర్చుపెట్టి చంద్ర‌బాబు సాధించిందేమిటి అని జ‌నం ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు.ఇక చివ‌రిరోజు పేప‌ర్‌,చాన‌ల్ల యాడ్స్‌కోసం రూ.12 కోట్లు త‌గ‌ల‌బెట్టారు.

{loadmodule mod_custom,GA2}

పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయాన్ని ప్రజలు గుర్తించకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాల్ని మభ్యపెట్టడానికి న‌వ‌నిర్మాణ దీక్ష‌లు చంద్ర‌బాబు నిర్వ‌హించార‌ని సెటైర్లు విసురుతున్నారు. అంతేకాకుండా ఈ దీక్ష‌ల ప్ర‌చారం కోసం మీడియాకు ప్యాకేజీలు ఇచ్చారు, రోజుకో గంటసేపు త‌న లైవ్‌లు ఊద‌ర‌గొట్టేందుకు మీడియాకు అప్పనంగా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేశారు. ఇది మ‌న బాబు దుబారా ఖ‌ర్చుల లెక్క‌.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -