Saturday, May 18, 2024
- Advertisement -

నెల్లూరు ఒకరోజు పర్యటనలో బిజీబిజీగా..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు ఒకరోజు  పర్యటనలో బిజీబిజీగా గడిపారు. జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. పలు అభివృద్థి పనులకు శంకుస్థాపన చేశారు. అధికారులతోను సమీక్షించిన ముఖ్యమంత్రి.. బహిరంగసభలో పాల్గొని ప్రజలకు హామీల వర్షం కురించారు. 

రోడ్డుమార్గం ద్వారా కావలి అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని టిడిపి నేతలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

కలిగిరి మండలం పెద్దపాడులో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌ కార్డులు, పింఛన్లు అందాలని చంద్రబాబు అన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలు, పరిశ్రమలు, గృహాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌‌ను అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

అనంతరం విఆర్. కళాశాల మైదానాన్కి చేరుకున్న చంద్రబాబు, అక్కడ మెగా టూరిజం సర్య్యూట్ అభివృద్ధి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత స్వచ్ఛ నెల్లూరు తెలుగు యాప్ ను ప్రారంభించారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఏపీకి టూరిజం హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని.. వీటితో పాటు జిల్లాలోని సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు. 

ఈ కార్యక్రమంలో  కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, థవార్ చంద్ గెహ్లాట్ పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. జిల్లా నగర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా కలిసి కట్టుగా ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -