Saturday, May 18, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ఎప్ప‌టికి సీఎం కాలేరా..?

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ సీఎం కావ‌ల‌నే ధ్యేయంతో ఎప్ప‌టి నుంచో ప‌ని చేస్తున్న నాయ‌కుడు. అధికారం కోసం గ‌త తొమ్మ‌ది సంవ‌త్స‌రాలుగా పోరాటం చేస్తున్నాడు జ‌గ‌న్. త‌న తండ్రి మాజీ సీఎం రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌రువాత అనుహ్యాంగా వెలుగులోకి వ‌చ్చాడు జ‌గ‌న్. త‌న తండ్రి మ‌ర‌ణాంత‌రం చోటు చేసుకున్న ప‌రిణమాల‌తో సొంతంగా పార్టీ పెట్టుకుని న‌డిపిస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల్లోనే విజ‌యం ఖాయం అనుకున్న జ‌గ‌న్‌కు షాకిచ్చారు ఏపీ ప్ర‌జ‌లు.

మోదీ వేవ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌తో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఇంతలా పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికి వైసీపీ పార్టీకి , టీడీపీ పార్టీకి ఓట్ల తేడా కేవ‌లం 1% మాత్ర‌మే. అంటే 5 ల‌క్ష‌లు ఓట్లు తేడా అన్నా మాట‌. ప‌వ‌న్ మ‌ద్ద‌తుతో కాపు కులం ఓట్లు అన్ని కూడా టీడీపీ పార్టీకే వేశారని ఉభ‌య గోదావ‌రి ఫ‌లితాలు చూస్తే అర్ధం అవుతోంది. అయితే ఈసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు జ‌గ‌న్. ఈ 5 సంవ‌త్స‌రాల్లో అధికార పార్టీ వైఫ‌ల్యాల‌తో పాటు, తాను చేప‌ట్టిన పాద‌యాత్ర ద్వారా వ‌చ్చిన సింపథితో తాను ఈజీగా గెలుస్తాన‌ని న‌మ్మ‌కంతో ఉన్నాడు జ‌గ‌న్. పైగా టీడీపీ పార్టీతో ఇప్పుడు జ‌న‌సేన, బీజేపీ కూడా లేదు అయితే టీడీపీ పార్టీ నాయ‌కులు జ‌గ‌న్ ఎప్ప‌టికి సీఎం కాలేడ‌ని వాదిస్తున్నారు.

ఎన్నిక‌లు జ‌రిగిన మొద‌టి నాలుగు రోజులు టీడీపీ నాయ‌కులు ఎవ‌రు కూడా బ‌య‌ట క‌నిపించ‌లేదు. దీంతో రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా జ‌గ‌న్ గెలుస్తాడ‌ని భావించారు. అయితే గ‌త రెండు , మూడు రోజులు నుంచి టీడీపీ నాయ‌కులు బ‌య‌టికి వ‌చ్చి మా పార్టీకి 120 నుంచి 150 సీట్లు రావ‌డం ఖాయం అని అంటున్నారు. అయితే వీరి ధీమాకి కూడా కార‌ణం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. గ్రౌండ్ లెవ‌ల్ నుంచి రిపోర్టు తెప్పించుకున్న టీడీపీ అధిష్టానంకు మంచి ఫ‌లితాలే అందాయాని స‌మాచారం. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన ప‌సుపు ,కుంకుమ కార్య‌క్రమంపై మ‌హిళ‌లు ఆనందంగా ఉన్నార‌ని తెలిసింద‌ట‌. దీంతో చాలామంది మ‌హిళ ఓట‌ర్లు టీడీపీకే ఓటు వేశార‌ని భావిస్తుంది టీడీపీ పార్టీ. ప్ర‌భుత్వం వ్య‌తిరేక ఓట్లు జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, వైసీపీలు పంచుకుంటాయి కాబ‌ట్టి, త‌మ ఓటు బ్యాంకుకు ఎటువంటి ఢోకా లేద‌ని భావిస్తుంది టీడీపీ పార్టీ. ఈ న‌మ్మ‌కంతోనే జ‌గ‌న్ ఎప్ప‌టికి సీఎం కాలేర‌ని వ్యాఖ్య‌నిస్తున్నారు టీడీపీ నాయ‌కులు. మ‌రి వీరి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేసి జ‌గ‌న్ త‌న క‌లను ఎలా నెర‌వేర్చుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -