Sunday, April 28, 2024
- Advertisement -

జగన్ను ప్రశ్నించడమే నేరమా.. ఎందుకీ దాడులు?

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీలో జనసేన వర్సస్ వైసీపీ మద్య రాజకీయ రగడ కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా మొదలైన ఈ పోలిటికల్ హిట్ ఇప్పటం వరకు కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటంలో జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా వైసీపీ ప్రభుత్వం ఇల్లు కూల్చిందని జనసేన తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇల్లు నష్టపోయిన వారికి పవన్ లక్ష రూపాయల చొప్పున విరాళం కూడా ప్రకటించారు. దీంతో జనసేన టార్గెట్ గా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే వాదనలు గట్టిగా వినిపించాయి. ఇక మరోసారి జనసేన నేతలపై ఇలాంటి వైఖరినే ప్రదర్శించింది వైసీపీ సర్కార్. చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు అక్రమంగా దాడులకు పాల్పడినట్లుగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన తరుపున రామచంద్రయాదవ్ పోటీ చేశారు. ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఆయన నియోజిక వర్గంలోని రైతు సమస్యలపై గళం విప్పేందుకూ రైతు భేరి సభను ఏర్పాటు చేయాలని తలంచారు. అయితే దీనికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. కాగా వైసీపీ వ్యతిరేకంగా సభ నిర్వహించేందుకు పూనుకోవడంతో రాత్రికి రాత్రే రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ వర్గం వాళ్ళు కర్రలతో, రాళ్ళతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై జనసేన పార్టీ ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

మంత్రి పెద్ద్రెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజిక వర్గంలో రైతు సభ నిర్వహించాలని అనుకోవడమే రామచంద్ర యాదవ్ చేసిన నేరమా ? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా దాడులకు పాల్పడడం ఏంటని నాదెండ్ల మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశించే వారు లేకుండా చేయడమే వైసీపీ లక్ష్యంగా ఉందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ” ఇది నటి రోజుల్లో బిహార్ కాదు.. నేటి రోజుల్లో పుంగనూరు.. ” అంటూ రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్న వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మొత్తానికి జనసేన టార్గెట్ గా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఒక్క ఛాన్స్ అంటే నమ్మి.. మోసపోయాం !

కే‌సి‌ఆర్ చుట్టూ బిగుస్తున్నా ఉచ్చు.. !

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -