Thursday, May 16, 2024
- Advertisement -

ఐటీ గ్రిడ్ అస‌లు ఏం చేస్తుంది? క‌ంప్లీట్ అనాల‌సిస్‌

- Advertisement -

ఐటీ గ్రీడ్ కేసుపై ఉపోద్ఘాతం అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ పేప‌ర్ చూసినా, ఏ చాన‌ల్ చూసినా దీనికి సంబంధించి వార్త‌లే. కానీ అస‌లు ఐటీ సంస్థ‌లో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంపైనే క్లారిటీ లేదు. కానీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్… ఈ కేసు మొత్తం గుట్టును విప్పే ప్రయత్నం చేశారు.

డేటా చోరీగా పిలుచుకుంటున్న ఈ కేసులో ఐటీ గ్రిడ్ పాత్ర ఏమిటి? అసలు ఆ సంస్థ చేస్తున్న తతంగం ఏమిటి? ఏం ఆశించి టీడీపీ ఈ సంస్థను రంగంలోకి దించింది? టీడీపీ అప్పగించిన పనిని ఈ సంస్థ ఏ రీతిన చక్కబెబుతోంది? ఫలితంగా బాధితుల పరిస్థితి ఏమిటి? అన్న సమగ్ర వివరాలను తెలియజేసేందుకు హైదరాబాద్ పోలీసులు గీసిన ఓ డయాగ్రమ్ విష‌యాన్ని క్లారిటీగా చెప్పేసింది.

అంజ‌నీకుమార్ చెప్పిన దాని ప్ర‌కారం… టీడీపీ సేవా మిత్ర పేరిట ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థఐటీ గ్రిడ్‌. ఈ యాప్ ద్వారా ఓటర్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించడంతో పాటుగా ఆ వివరాలను భద్రపరచడం – అవసరమైన డేటాను టీడీపీకి పంపడం – టీడీపీ ఇచ్చిన సమాచారం మేరకు ఓటర్లను విచారించడం – వారికి సంబంధించి మరిన్ని వివరాలను సేకరించడం – తిరిగి ఆ సమాచారాన్ని టీడీపీకి పంపడం – పార్టీలో ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక వ్యక్తి ఇచ్చే ఆదేశాల మేరకు… అంతిమంగా మరో ఓటరు జాబితాను చేతిలో పెట్టుకున్న వ్యక్తికి ఈ సమాచారాన్ని పంపడం… ఇవీ ఐటీ గ్రిడ్ ప్రధాన విధులు.

టీడీపీ బూత్ లెవెల్ సేవా మిత్ర కన్వీనర్ నుంచి కొంత సమాచారం సేవామిత్ర యాప్ ద్వారా ఐటీ గ్రిడ్‌ చేరుతుంది. ఆ సమాచారంలోని వ్యక్తులను ఫోన్ ద్వారా పలకరించి ఆయా వ్యక్తులకు సంబంధించి మరిన్ని సమగ్ర వివరాలను ఐటీ గ్రిడ్ సేకరిస్తుంది. ఈ సందర్భంగా సదరు వ్యక్తులకు సంధించే ప్రశ్నావళితో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారన్న కీలక ప్రశ్న కూడా ఉంటుంది. ఈ సర్వే ముగిసిన మరుక్షణమే… బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్ ఇచ్చిన సమాచారంతో పాటుగా తన సర్వేలో సేకరించిన వివరాలను జోడించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్… టీడీపీకి పంపుతుంది.

అక్క‌డితో ఈ వ్య‌వ‌స్థ ఆగిపోదు …ఈ సమాచారాన్ని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపడంతో పాటుగా తనకు ఎవరైతే ప్రాథమిక వివరాలు అందించారో సదరు బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్ కు కూడా ఐటీ గ్రిడ్ పంపుతుంది. ఈ వివరాలను చేతబట్టుకుని కార్యరంగంలోకి దిగే బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్.. తాను ఎంచుకున్న వ్యక్తుల నుంచి ఆధార్ – ఓటరు ఐడీ – ఫోన్ నెంబరు తదితర వివరాలను సేకరిస్తారు. ఈ సేకరణలో సదరు ఓటరు సామాజిక వర్గం వివరాలు కూడా సేకరిస్తారట. ఆ తర్వాత ఈ వివరాలను బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్ తిరిగి ఐటీ గ్రిడ్ కు పంపుతారు.

ఈ మొత్తం సమాచారాన్ని క్రోడికరించిన తర్వాత ఐటీ గ్రిడ్ సమగ్ర డేటాను టీడీపీలోని కీలక స్థానంలో కూర్చున్న వ్యక్తికి పంపుతుంది. దీనిని పరిశీలించిన తర్వత సదరు ఓటరు ఈ దఫా తమకు ఓటేయరని నిర్ధారించే సదరు కీలక నేత ఓటరు జాబితాతో ఎల్ల‌వేళలా సిద్ధంగా ఉండే అధికారికి పంపుతారు. ఇక అంతే… సదరు ఓటరు పేరు ఓటరు జాబితా నుంచి డిలీట్ అయిపోతుంది. ఇదీ మొత్తంగా ఐటీ గ్రిడ్ కేంద్రంగా జరుగుతున్న తంతు అనేది పోలీసులు భావిస్తున్నారు.

అంటే బూత్ లెవెల్ టీడీపీ సేవా మిత్ర కన్వీనర్ వద్ద నుంచి ప్రారంభమయ్యే ఈ తంతు ఐటీ గ్రిడ్ కేంద్రంగా పలు మార్గాల్లో పలు విశ్లేషణల తర్వాత పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న నేతకు చేరుతుందన్న మాట. తమకు ఓటేస్తారని భావించే ఓటరుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు గానీ… తమకు ఓటేయరని భావించే వారి ఓట్లు మాత్రం అప్పటికప్పుడు గల్లంతైపోతున్నాయన్న మాట. డేటా చోరీ అంటూ ఓ నాలుగు అక్షరాల రెండు పదాలతో కూడిన ఈ వివాదంలో ఇంత పెద్ద తతంగం నడుస్తోందన్న మాట.

అయితే ఇది కేవ‌లం సేవామిత్ర యాప్ గురించి మాత్ర‌మే.. ఈ సంస్థ‌కు ఇంత డేటా ఎలాగొచ్చింది? ఇంక ఏ ఏ కార్య‌క‌ర్ర‌మాలు ఈ సంస్థ‌లో చేస్తార‌నే దానిపై మ‌రికొంత విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -