కడప జిల్లా పుల్లంపేట మండలం లో కరోనా కలకలం

ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. కడప జిల్లాలో కరోనా లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం దొండ్లో పల్లి కి చెందిన పెరుగు శివరామయ్య కు కరోనా సోకినట్లు నిర్దారణ.

దొండ్లో పల్లి కి 23వ తారీఖున నెల్లూరు నుండి వచ్చినట్లు సమాచారం. అలాగే పెనగలూరు మండలం ఇండ్లూరు లో తన చెల్లెల్లు ఇంటికి వెళ్లినట్లు సమాచారం. దొండ్లపల్లి ని పరిశీలించి శివరామయ్య కుటుంబ సభ్యులను కడపకు తరలించిన అధికారులు.

ఇక మరోవైపు కడప జిల్లాలోనూ కరోనా భయాలు మొదలయ్యాయి. పది రోజుల క్రితం కువైట్‌ నుంచి పుల్లంపేట మండలానికి వచ్చిన ఓ వ్యక్తి.. దగ్గు, జలుబుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయంటూ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌ నిర్ధారణ కోసం వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించారు.

దేశాన్ని కరోనా కమ్మేస్తోంది.. ఇప్పటికే 30 వేల చేరువలో కరోనా బాదితులు. కరోనా సోకి 900 మందికి పైగా మృతి మరణించారు. ఇక కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మరణించారు.