దేశంలో మళ్ళీ పెరుగు తున్న క‌రోనా కేసులు!

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా థర్డ్​వేవ్​ విషయంలో ఆందోళన నెలకొన్నది. కొందరు నిపుణులు థర్డ్​వేవ్​ తప్పదని హెచ్చరిస్తున్నారు. థర్డ్​వేవ్​ విషయంలో దేశప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ముమ్మరం చేయాలని కూడా ఐఎంఏ సూచించింది.

అయితే గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,625 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 24 గంటల్లో 562 మంది క‌రోనా బాధితులు మృతి చెందారు.

దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,25,757కు పెరిగింది. ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. 4,10,353 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 48,52,86,570 వ్యాక్సిన్ డోసులు వేయగా నిన్న‌ ఒక్క రోజు 62,53,741 డోసులు వేశారు.

Also Read

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -