Wednesday, April 24, 2024
- Advertisement -

కరీంనగర్ లో లాక్ డౌన్

- Advertisement -

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గూడేనికి చెందిన పిట్టల చందు ఈనెల 16న దుబాయ్ నుంచి స్వస్థానికి వచ్చారు. ఆయనకు ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆయనను కలిసిన 14 మందికి ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయన తల్లి, భార్యకు పాజిటివ్ అని తెలిసింది. దీంతో గూడెంలో లాక్ డౌన్ విధించారు.

తమ గూడెంలోని ముగ్గురికి కరోనా సోకడంతో లాక్ డౌన్ విధించినట్టు పంచాయతీ పాలక వర్గం తెలిపింది. గూడెంలోని దుకాణాలు, హోటల్లు, బడులు మూసివేశారు. మరో 10 రోజుల పాటు తమ గూడెంలోకి రానీయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ వెల్లడించారు.

గూడెంలోని మరికొంత మంది నుంచి నమూనాలు సేకరించిన జిల్లా వైద్య అధికారులు నమూనాలను హైదరాబాద్లోని గాంధీ ఆసుత్రిలోని ల్యాబరేటరీకి పంపించారు. ఒమిక్రాన్ గా నిర్ధారణ ఆయిన వారి కుటుంబంతో కలిసిన మరి కొంత మందిని హోం క్వారంటైన్లో ఉంచామని అధికారులు తెలిపారు.

తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ?

కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న.. ఒమైక్రాన్‌ సోకుతుందా ?

నెటిజన్‌ కు సమంత దిమ్మతిరిగే కౌంటర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -