Monday, May 20, 2024
- Advertisement -

అభివృద్ధికి కార్పొరేట్ కలరింగ్

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైటెక్ పాలన అంటే ఏంటో చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సీఎంగా అంతకంటే ఎక్కువ స్పీడ్ గా పని చేస్తున్నారు. టెక్నాలజీ విషయంలో అప్ డేట్ గా ఉండే బాబు.. అదే టెక్నాలజీని ఇప్పుడు ఏపీ పాలనలో ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ పేరుతో ఓ వ్యవస్థ ఏర్పాటు చేసిన సీఎం… జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు దాని బాధ్యత అప్పగించనున్నారు.

లోటు బడ్జెట్ ను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ ను పూర్తిగా వాడుకునే పనిలో పడ్డారు. బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు.. ఫౌండేషన్ బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన.. బాబు నుంచి రానుంది.

రతన్ టాటాను.. ఫౌండేషన్ చీఫ్ గా అపాయింట్ చేయడమే కాక.. అజీం ప్రేమ్ జీ, ముఖేష్ అంబానీ, జీఎంఆర్, జీవీకే లాంటి ప్రముఖులనూ సభ్యులుగా చేరుస్తారట. అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ సంస్థలు.. ఏపీలోని గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించే బాధ్యత వీరికి అప్పగిస్తారట. అక్కడితో ఆగకుండా.. వీలైనంత వరకూ… ప్రతి గ్రామాన్ని మోడల్ గా చేయడం.. ఏదో ఒక రంగంలో అభివృద్ధి చేయడం లాంటి ప్రణాళికలు కూడా ఫైనల్ చేస్తున్నారట. 

వినడానికైతే బాగానే ఉంది. సక్సెస్ ఫుల్ గా అమలైతే.. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాలకు బాబు రూలింగ్ ఆదర్శంగా ఉంటుంది. కానీ.. అంతర్జాతీయ వ్యాపకాలతో రోజూ తీరిక లేని బిజినెస్ టైకూన్లు.. 13 జిల్లాల రాష్ట్రం కోసం ఎంత వరకు టైమ్ కేటాయిస్తారన్న విషయంలోనే కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -