Monday, May 20, 2024
- Advertisement -

ఒక్క మ‌ర‌ణం…వేల‌కోట్ల రూపాయ‌లు లాక్‌… ఆందోళ‌న‌లో ఖాతాదారులు

- Advertisement -

కెనడాకి చెందిన క్రిప్టో కరెన్సీ సంస్థ క్వాడ్రిగాసీఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో గెరాల్డ్ కాటన్ మరణంతో క్రిప్టో కరెన్సీ కంపెనీ ఖాతాదారులు చిక్కుల్లో ప‌డ్డారు. లావాదేవీలు జరపడానికి కావాల్సిన పాస్‌వర్డ్‌ ఎవరికీ తెలియకపోవడమే ఇందుకు అసలు కారణం. దీంతో రూ.1,300కోట్ల కరెన్సీ లాకైపోయింది.

భారత పర్యటనకు వచ్చిన 30 ఏళ్ల గెరాల్డ్ పేగు సంబంధ వ్యాధితో డిసెంబర్ 2018లో మరణించారు. కరెన్సీ అన్ లాక్ చేసే పాస్ వర్డ్ లన్నీ కేవలం కాటెన్ కి మాత్రమే తెలుసు. చివరికి గెరాల్డ్ భార్య జెన్నిఫర్ రాబర్ట్ సన్ కి కూడా ఈ పాస్ వర్డ్ లు తెలియవు.పెద్ద పెద్ద సెక్యూరిటీ నిపుణులు కూడా ఈ కరెన్సీని అన్ లాక్ చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ ఖాతాదారులకు ఎలా డబ్బు తిరిగి ఇవ్వాలనేది పెద్ద సమస్యగా మారింది.

మరణానికి ముందు గెరాల్డ్ కాటన్ ఎప్పుడూ ఎవరికీ పాస్ వర్డ్ లు చెప్పలేదు. కాటన్ భార్య జెన్నిఫర్ రాబర్ట్ సన్, ఆయన కంపెనీ కెనడా కోర్టులో క్రెడిట్ ప్రొటెక్షన్ అప్పీల్ దాఖలు చేయడంతో కాటన్ మరణించిన వార్త ప్రపంచానికి తెలిసింది. గెరాల్డ్ ఎన్ క్రిప్టెడ్ అకౌంట్ ని అన్ లాక్ చేయడం సాధ్యం కావడం లేదని పిటిషన్ లో వారు తెలిపారు.

కాటన్ కి చెందిన క్వాడ్రిగాసీఎక్స్ సంస్థ తమ వెబ్ సైట్ ద్వారా ఈ ఆర్థిక సమస్యను పరిష్కరించేందుకు తమను అనుమతించాలని నోవా స్కాటియా సుప్రీంకోర్టును కోరింది. ఇది లాక్ కావడంతో 1.15 లక్షల యూజర్లు ప్రభావితం అవుతారు. కంపెనీకి 3.63 లక్షల రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -