Saturday, May 18, 2024
- Advertisement -

పసునూరి దయాకర్ వర్సెస్ సిరిసిల్ల రాజయ్య

- Advertisement -

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్ తో పాటు.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావడంతో బరిలో దూకేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే లెఫ్ట్ పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వరంగల్ లోకల్ నాయకుడు, తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగా గుర్తింపు ఉన్న పసునూరి దయాకర్ కు టికెట్ దక్కింది.

టీఆర్ఎస్ నుంచి టికెట్ రేస్ లో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా.. సీనియర్ నేతలతో సుదీర్ఘ మంతనాలు.. అనేక రాజకీయ సమీకరణాల తర్వాత.. దయాకర్ ను గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు.

కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. మళ్లీ టికెట్ దక్కించుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ పేర్లను కూడా పరిశీలించినా.. చివరికి రాజయ్యకే టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ హై కమాండ్. వివేక్ ను బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ భావించినా.. వరంగల్ నుంచి పోటీకి ఆయన ఆసక్తిగా లేకపోవడంతో.. కాంగ్రెస్ కు మరో అవకాశం లేకుండా పోయింది. సర్వే సత్యనారాయణ వరంగల్ స్థానికుడు కాకపోవడం కూడా.. రాజయ్యకు కలిసొచ్చింది. వాస్తవానికి రాజయ్య కూడా లోకల్ అభ్యర్థి కాదు. కానీ.. వరంగల్ లో జెడ్పీ సీఈవోగా పని చేయడం.. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా ఉండి 2009లో వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలవడం చాలా మందికి తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితిలో.. జిల్లా ప్రజలకు బాగా పరిచయం ఉన్న సిరిసిల్ల రాజయ్యే.. కాంగ్రెస్ అభ్యర్థిగా ఫైనల్ అయ్యారు.

తెలంగాణ ఉద్యమ కేంద్రమైన వరంగల్ గడ్డపై జరుగుతున్న ఈ ఉప ఎన్నికను.. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏడాదిన్నర కేసీఆర్ పాలనలో తప్పులు వెతుకుతూ ఉప ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు గత పాలకుల తీరు ఎండగడుతూ.. సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓరుగల్లు కోటపై మళ్లీ పాగా వేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -