Thursday, May 16, 2024
- Advertisement -

హిందూ మహాసముద్రంలో ప్రతికూలతే కారణం

- Advertisement -

ప్రతి ఏటా జూన్ మొదటివారంలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ఆలస్యం కానున్నాయి. హిందూ మహాసముద్రంలో వచ్చిన ప్రతికూల పరిస్ధితులే ఇందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 7 నాటికి కేరళలో రుతు పవనాలు ప్రవేశిస్తాయి. అయితే ప్రయివేట్ వాతావరణ సంస్ధలు మాత్రం మె నెలాఖరు నాటికే రుతుపవనాలు వస్తాయని పేర్కొన్నారు.

ఎల్ నినో ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది వర్షాలు భారీగానే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళ, కర్నాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీనిపై వాతావరణ శాఖ మాత్రం పెదవి విప్పడం లేదు. ఈ వర్షాలకు, రుతుపవనాల రాకకు ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. దక్షిణ ద్వీపకల్పం దిశగా రుతుపవనాల జాడ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్ 10 నాటిని కేరళలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి.  పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -