Friday, March 29, 2024
- Advertisement -

రెండు రోజులు బయటకు రాకండి.. ఎందుకో తెలుసా?

- Advertisement -

దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఇది చాలదని ఇప్పుడు భాను డు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య శనివారం నాటికి 30 లక్షలకు చేరుకుంది. టీకా కార్యక్రమం ఆశించిన స్థాయిలో కొనసాగకపోవడం, బ్రెజిల్, భారత్‌లాంటి దేశాల్లో సెకండ్ వేవ్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఇక కొవిడ్ విజృంభణ, దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాలు కూడా అన్ని దేశాల్లో ఒకే మాదిరిగా లేకపోవడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ సగటున రోజుకు 12 వేలకు పైగా మరణాలు, 7 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. భారత్ లో గడచిన 24 గంటల్లో 2.34 లక్షల కరోనా పాజిటివ్ కేసులు రావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా, విదర్భ నుంచి మరాట్వాడా వరకూ, కర్ణాటక నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణులు కొనసాగుతుండటమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. అవసరం ఉంటేనే.. తగు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు బయటకు రావాలని సూచించారు.

నేటి పంచాంగం,ఆదివారం(18-04-2021)

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా కలకలం..

‘మహాసముద్రం’ సిద్దార్థ ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -