Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రజలు చనిపోతున్నారు.. చోద్యం చూస్తున్నారా? ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు సీరియస్!

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎంతగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఒకే రోజు మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించే పరిస్థితి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా తీవ్రత ఘోరంగా ఉది. ఢిల్లీలో కరోనా వైరస్ వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 306 మంది మృతి చెందారు. సోమవారం నుంచి 200కు తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి.

ఆ రోజు 240 మంది, మంగళవారం 277 మంది, బుధవారం 249 మంది, గురువారం 306 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. ఆక్సిజన్ కొరత విషయంలో కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవాలని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీకి కేటాయించిన 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు అందుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇక జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో 20 మంది కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో రెచ్చిపోయిన మలమాళీ ముద్దుగుమ్మ!

ప్రభాస్ పై శ్రుతి హసన్ కామెంట్..!

హోం క్వారంటైన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -