Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్ కేసులో అత్యుత్సాహం…బొల్లినేని శ్రీనివాస్ గాంధీకీ ఈడీ ఉచ్చు

- Advertisement -

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కేసులో చంద్ర‌బాబు అదేశాల‌కు అనుగునంగా వ్వ‌వ‌హిరించారి ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న ఈడీ అధికారి బొల్లినేని గాంధి చూట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. శ్రీనివాస గాంధీపై ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. గాంధీ… భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈనెల 8న గాంధీపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఆస్తులపై ఏక కాలంలో దాడులు నిర్వ‌హించారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.200 కోట్ల విలువైన అక్రమాస్తుల్ని గుర్తించారు. సీబీఐ కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు.. గాంధీపై ఈ మేరకు కేసు నమోదు చేశారు.

2010 నుంచి 2019 వరకు శ్రీనివాస గాంధీ ఈడీ అధికారిగా పనిచేశారు. శ్రీనివాస గాంధీ ఆస్తులు 288శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. శ్రీనివాసగాంధీ అక్రమాస్తులను ఈడీకి ఎటాచ్ చేయనున్నారు. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమన్లు కూడా జారీ చేశారు.

ఈడీలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని గాంధీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన చెప్పిన వారిని టార్గెట్‌ చేయడం, అనుకూలంగా వ్యవహరించాలని కోరిన వారిని విడిచిపెడుతూ భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఫిర్యాదులు ఉన్నాయి.

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. అప్పటి ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న బొల్లినేని గాంధీతోపాటు ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్‌ల‌పై ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఈడీ కేసులతో ఏమాత్రం సంబంధం లేని తన భార్య భారతికి కూడా నోటీసులు జారీ చేశారని జగన్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -