Friday, May 17, 2024
- Advertisement -

కొంప మునిగింది వరసగా మూడు రోజులు  బ్యాంకులు బంద్ 

- Advertisement -
Extended weekend Banks to remain closed for 3 days

ఇప్పటికే నోట్ల రద్దు తో కష్టాల్లో పడ్డ ప్రజల నెత్తి మీద మరొక పిడుగు పడింది. ఈ నిర్ణయం తీసుకున్న మూడు వారాల తరవాత కూడా పరిస్థితి సర్దుకోక పోగా జనాలకి ఇంకా కొత్త తలనొప్పులు ఒస్తున్నాయి. ఇదివరకు మీద బ్యాంకులలో , atm లలో క్యూలు కాస్తంత తగ్గుతున్నాయి.

కొత్త రూ.500 నోట్లు బ్యాంకుల‌కు చేర‌డంతో కాస్త ఊర‌ట క‌నిపించింది. అయితే ప్ర‌జ‌ల‌కు ఈ సంతోషం ఎంతోసేపు నిల‌వ‌లేదు. వ‌రుస‌గా రెండు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రావ‌డంతో వారిలో నిరాశ ఆవ‌రించింది.

26వ తేదీ నాలుగో శ‌నివారం, 27 ఆదివారం కావడంతో రెండు రోజులు బ్యాంకుల‌కు తాళాలు త‌ప్ప‌ని ప‌రిస్థితి. 28న నోట్ల ర‌ద్దుకు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఇచ్చిన బంద్‌లో బ్యాంకులు కూడా పాల్గొంటే వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. అదే క‌నుక జ‌రిగితే నోట్ల ర‌ద్దు మ‌రుస‌టి రోజు నాటి పరిస్థితి మ‌ళ్లీ త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాంకులు తెరుచుకోక‌, ఏటీఎంల‌లో డ‌బ్బులు లేక ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కాబ‌ట్టి శ‌ని, ఆదివారాల్లో స‌రిప‌డా న‌గ‌దును ఏటీఎంల‌లో స‌ర్దితే ప్ర‌జ‌ల క‌ష్టాలు కొంత‌వ‌ర‌కైనా తీరే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం, బ్యాంకు అధికారులు ఈ విష‌యంలో చొర‌వ తీసుకుని ముందుగానే ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -