Wednesday, May 1, 2024
- Advertisement -

లోకేష్‌పై రోజా సినిమా డైలాగ్ పంచ్ అదిరింది

- Advertisement -
Firebrand Roja counter to Nara Lokesh

వైసీపీలో మ‌హిళా ఫైర్ బ్రాండ్ అంటె ట‌క్కున గుర్తుకొచ్చే న‌గ‌రి ఎమ్మెల్యే రోజా. ప్ర‌త్య‌ర్థి పార్టీలు వైసీపీని విమ‌ర్శించాలంటె కాస్త వెనుకా ముందూ అలోచించుకొని మాట్లాడ‌తారు…లేకుంటే వారికి చుక్కులు క‌నిపిండం ఖాయం.

చంద్రబాబు నవనిర్మాణ దీక్షలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏవిధంగా ఫైర్ అయ్యారో తెలిసిందే.న‌వ‌నిర్మాణ దీక్ష కాదు నారావారి న‌య‌వంచ‌న‌దీక్ష‌ని విమ‌ర్శించారు.ప‌నిలో ప‌నిగా ఐటీ మంత్రి లోకేష్‌పై కూడా అదిర‌పోయే పంచ్ డైలాగ్‌లు వ‌దిలింది.

{loadmodule mod_custom,GA1}

విశాఖ ప‌ట్నంలో టీడీపీ మ‌హానాడును మూడు రోజుల పాటు అట్ట‌హాసంగా నిర్వ‌హించింది. ఈ మ‌హానాడులో జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం త‌ప్ప వేరే ఆలోచ‌న‌లేదు ప‌చ్చ పార్టీ నాయ‌కుల‌కు.చంద్ర‌బాబు నుంచి మొద‌లు కొని మంత్రులు,ఎమ్మెల్యేలు అంద‌రూ జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌న చేశారు.ప‌నిలో ప‌నిగా నారావారి పుత్ర‌ర‌త్నం, తెలుగు పండితుడు ,ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కూడా జ‌గ‌న్‌పై పంచ్‌డైలాగులు కురిపించారు.క‌నీసం మాట్లాడ‌టం చేత‌కాని లోకేష్ జ‌గ‌న్ విమ‌ర్శచ‌డం మొద‌లు పెట్టారు.
నాకు ..మానాన్న‌కు మ‌ధ్య‌లో గొడ‌వులు పెడ్తున్నార‌ని విమ‌ర్శించారు.అభివృద్ధి చేస్తుంటె ఓర్వ‌లేని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ద‌మ్ముంటె జ‌న‌గ్ నాపై వ‌చ్చిన అవినీతి ఆరోప‌న‌లు నిరూపించాల‌ని జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు.తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ల‌క్ష‌ల కోట్లు సంపాదించార‌ని ఆరోప‌న‌లు గుప్పించి శ‌భాష్ అనిపించుకున్నారు.

{loadmodule mod_custom,GA2}

ఇంకే ముంది లోకేష్ ….. జ‌గ‌న్‌పై విసిరిన స‌వాల్‌పై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా విరుచుకు ప‌డ్డారు.క‌నీసం తెలుగు స‌రిగా మాట్లాడ‌లేని లోకేష్ జ‌గ‌న్‌కు స‌వాల్ విస‌ర‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.ప‌నిలో ప‌నిగా లోకేష్‌పై అదిరిపోయే సినిమాడైలాగ్ పంచ్‌ను విసిరింది రోజా. జ‌గ‌న్‌పై ….. లోకేష్ స‌వాల్ చూస్తె …డిక్కీ బ‌లిసిన కోడి చికెన్ షాపు ముందు కొచ్చి తొడ‌గొట్టిన‌ట్లుంద‌ని అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది.అంటె లోకేష్ డిక్కీ బ‌లిసిన కోడి అని అర్థం.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -