గోవా అంటానే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది అందమైనబీచ్‌లు,పార్క్‌లు,రిసార్ట్‌లు ఆహ్లాదకరమైన సముద్ర అందాలతో నిరంతరం పుబిజీగాఉంటుంది.దేశంనుంచే కాకుండాదేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులు, ప్రకృతి ఒడిలో సేద తీర్చు కుంటూ ఉంటారు. నైటంతా మందు,రేవ్ పార్టీలు సర్వసాధారనం. అయితే వీటిమీద గోవా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
బీచ్‌లకు, బీచ్ పార్టీలకు మారుపేరుగా నిలిచిన గోవాలో ఇకనుంచి అన్ని రకాల మిడ్-నైట్ పార్టీలను, రేవ్-పార్టీలను పూర్తిగా నిషేధించేం దుకు రంగం సిద్ధం చేసుకుంటుంది గోవా ప్రభుత్వం.కొత్తగా బీజేపీ ప్రభుత్వంఏర్పడిన తర్వాత ఈనిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విధమైన పార్టీలకు 80 శాతం ముగింపు పలికిన ప్రభుత్వం వీటిని పూర్తిగా నిషేధించే వైపు పావులు కదుపుతోంది. వచ్చే రెండుమూడు వారాల్లో లేట్-నైట్ పార్టీలు, రేవ్-పార్టీలపై పూర్తి నిషేధం విధించనున్నట్టు గోవా ప్రభుత్వం సంచలన నిర్నయం తీసుకుంటోంది.
వీటిని నిషేధించడానికి ప్రధానంగా గోవా తీరం లో డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా నియంత్రించలేని స్థితికి చేరిందనీ, అందుకే తక్షణం ఈ పార్టీలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. దేశం లోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత బీచ్‌లతో గోవా తీరం కళకళ లాడుతుంది. పర్యాటక సౌంధర్యాలతో తీర ప్రాంత అందాలతో అలరించే గోవా వెనుక మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు విక్రయం కూడా జోరుగా సాగటం గమనిస్తూనే ఉన్నాం. వీటికి తోడు మిడ్‌నైట్,రేవ్ పార్టీల వల్ల ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు ,హత్యలుజరుగుతున్నాయని వీటన్నింటినీ నిషేధించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఆందన్నారు గోవా జలవనరుల మంత్రి వినోద్ పాలేకర్ ప్రకటించారు.
దీనికి సంబంధించింది పోలీసుల అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనేక హెచ్చరికలు, రిమైండర్లు పంపినప్పటికీ, తెల్లవారు జామున 3-4 గంటల వరకు ఈ పార్టీలు కొనసాగు తున్నాయని, దీని మూలంగా పెద్దవాళ్లే కాకుండా, వివిధ బోర్డు పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధినీ విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇప్పటి వరకు వీటిపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు.ఇకనుంచి అలాంటి వ్యవహారాలు కుదరవు.అందుకే ఎంజాయ్‌చేయాలనీ గోవా వెల్లే మందు,విందు బాబులకు షాకేమరి.
Also Read
- న్యూ ఇయర్ అర్ధరాత్రి అమ్మాయితో దొరికిన టాలీవుడ్ హీరో
- పరిణీతి చోప్రా ఆక్కడ దాక్కుంది .. అసలేమైంది
- చంద్రబాబును ఇరకాటంలో పడేసిన బీచ్‌లో లవ్ ఫెస్టివల్..!
- బెడ్ రూంలో సెల్ఫీలతో రెచ్చిపోయిన ఆంటీ