- Advertisement -

పరిణీతి చోప్రా ఆక్కడ దాక్కుంది .. అసలేమైంది

- Advertisement -

వారిది అభిమానం అనాలో లేక మరేమనాలో తెలియదు కానీ… తాజాగా పరిణితి చోప్రాకు చుక్కలు చూపించారట ఆమె ఫ్యాన్స్! సాదారణంగా సినీనటులంటే అందరికీ అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం కొన్ని సందర్భాల్లో హీరోల విషయంలో ఒకలా ఉంటే హీరోయిన్స్ విషయంలో మరోలా ఉంటుంది! అందుకే జనాల మధ్యలోకి వచ్చే సందర్భంలో హీరోయిన్స్ తెగ కంగారుపడిపోతుంటారు.

ఎందుకంటే ఈ హడావిడిలో హీరోయిన్స్ ని పట్టుకునేవాళ్లూ – వారి పర్సనల్ పార్ట్స్ ని టచ్ చేసేవారూ ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఈ పరిస్థితిని అనుభవించినవారే!! అందుకే షాప్స్ – స్టోర్స్ ఓపెనింగ్స్ కి వచ్చేటప్పుడు చుట్టూ వీలైనంత ఎక్కువమంది బౌన్సర్లు ఉండేలా చూసుకుంటారు. మరి వ్యక్తిగతంగా ఏ షాపింగ్ కో – సినిమాకో – రెస్టారెంట్ కో వెళ్లాల్సి వస్తే.. అక్కడ ఫ్యాన్స్ కి దొరికిపోతే.. ఆ ఇబ్బందిని తాజాగా ఎదుర్కొంది పరిణితి చోప్రా.

ఈమధ్య గోవా ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రాను ఫ్యాన్స్ చుట్టుముట్టారట. సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారట. అయితే వారి అభిమానం అక్కడితో ఆగితే పర్లేదు కానీ… ఆమెతో కరచాలనం చేయాలని ఏకంగా ఆమెను పట్టుకోవాలని చాలామంది ప్రయత్నించారట. ఈ సందర్భంలో చిన్నసైజు తోపులాటే జరగడంతో ఆ ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని తట్టుకోలేక సైలెంట్గా సైడ్ అయిపోయిన పరిణితి… పక్కనున్న రెస్టారెంట్ లో దాక్కోవాల్సి వచ్చిందట. కాసేపటికి ఆ హడావిడి కాస్త తగ్గుముకం పట్టడంతో సీఐఎస్ ఎఫ్ సాయంతో అక్కడనుంచి బయటపడిందట. పాపం… పరిణితికి ఫ్యాన్స్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చాయో కదా!!

Related

  1. రేష్మి కి చుక్కలు చూపించిన ప్రేక్షకులు!
  2. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. రాఘవ కు చుక్కలు చూపించిన పోలీసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -